News December 24, 2025

అంటే.. ఏంటి?: Triumph

image

ఈ పదం గ్రీకు భాషలో మొదలై మూడు భాషల పరిణామంతో ఇంగ్లిష్‌లోకి వచ్చింది. గ్రీకు భాషలో Thriambos పదం నుంచి లాటిన్‌లోకి triumphusగా మార్చబడింది. దాన్నుంచి పురాతన ఫ్రెంచ్‌లో triumpheగా రూపాంతరం చెంది ఇంగ్లిష్‌లో Triumphగా స్థిరపడింది. ఈ పదం అర్థం ఘన విజయం.
-రోజూ 12pmకు అంటే.. ఏంటి?లో ఓ కొత్త పదం గురించి తెలుసుకుందాం.
<<-se>>#AnteEnti<<>>

Similar News

News December 24, 2025

RCFLలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

రాష్ట్రీయ కెమికల్స్ & ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (<>RCFL<<>>) 10 Sr. ఇంజినీర్, మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి BE/ B.Tech (కెమికల్ Engg., కెమికల్ టెక్నాలజీ, పెట్రోకెమికల్ Engg., పెట్రోకెమికల్ టెక్నాలజీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు నేటి నుంచి JAN 7 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, PwBDలకు ఫీజు లేదు. DV, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. www.rcfltd.com

News December 24, 2025

రాళ్లు పెరుగుతాయా? శాస్త్రవేత్తలు ఏమన్నారంటే?

image

భూమి పుట్టుక నుంచి నేటి వరకు జరిగిన మార్పులకు రాళ్లు సజీవ సాక్ష్యాలని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాళ్లు ప్రధానంగా 3 రకాలు. అగ్నిపర్వత లావాతో ఏర్పడే ఇగ్నియస్, ఇసుక-మట్టి పొరలతో తయారయ్యే సెడిమెంటరీ, ఒత్తిడి వల్ల రూపాంతరం చెందే మెటామార్ఫిక్. రాళ్లు పెరగవని, వాతావరణ మార్పుల వల్ల అరిగిపోతాయన్నారు. ఐరన్ ఎక్కువైతే ఎర్రగా, క్వార్ట్జ్ వల్ల తెల్లగా, కార్బన్ ఉంటే ముదురు రంగులో కనిపిస్తాయి.

News December 24, 2025

నల్ల వెల్లుల్లి గురించి తెలుసా.. బోలెడు ప్రయోజనాలు

image

వెల్లుల్లి అంటే తెల్లటి రెబ్బలే గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు నల్ల వెల్లుల్లి గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. తెల్ల వెల్లుల్లిని ఫర్మంటేషన్ ప్రక్రియ ద్వారా నల్లగా తయారు చేస్తారు. ఇది ఘాటు వాసన లేకుండా కొంచెం తీపిగా ఉంటుంది. నల్ల వెల్లుల్లి చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోజుకు ఒకటి రెండు రెబ్బలు తింటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.