News December 21, 2025

అంటే.. ఏంటి?: Wunderkind

image

చిన్నవయసులో అసాధారణ ప్రతిభ గల, విజయాలు సాధించిన వారి గురించి చెప్పేటప్పుడు వారిని Wunderkind పర్యాయ పదంతో ప్రస్తావిస్తారు. జర్మన్ భాషలోని Wunder (wonder), Kind (child) పదాల నుంచి ఇది పుట్టింది.
Ex: AI Wunderkind Alexander Wang..
28సం.ల అలెగ్జాండర్ వాంగ్ స్కేల్ AI సంస్థను స్థాపించగా $14.8 బిలియన్లు చెల్లించి జుకర్‌బర్గ్ అందులో 49% వాటా కొన్నారు. (రోజూ 12pmకు అంటే ఏంటి పబ్లిష్ అవుతుంది)
<<-se>>#AnteEnti<<>>

Similar News

News December 21, 2025

ఏం సౌకర్యాలు కల్పించారని ఛార్జీల పెంపు?

image

₹600Cr అదనపు ఆదాయమే లక్ష్యంగా <<18630596>>రైల్వే ఛార్జీలను <<>>పెంచింది. అయితే కొత్తగా ఏం సౌకర్యాలు కల్పించారని ఈ రేట్ల పెంపు అనే ప్రశ్నలు వస్తున్నాయి. పండుగలొస్తే నిలబడి ప్రయాణించే పరిస్థితి మారలేదు. ముక్కుబిగబట్టి టాయిలెట్‌కు వెళ్లే దుర్భర స్థితిలోనూ మార్పులేదు. సరైన సమయానికి రైలు స్టేషన్‌కు వచ్చిన రికార్డూ లేదు. కరోనాలో ఆగిపోయిన వృద్ధులు, వికలాంగులకు ఇచ్చే రాయితీని పునరుద్ధరించలేదు. మరి ఎందుకు ఛార్జీల పెంపు?

News December 21, 2025

డబ్బు కాదు.. హ్యాపీ లైఫ్ సీక్రెట్ ఇదే

image

డబ్బు, పేరు ప్రతిష్ఠలే సంతోషాన్ని ఇస్తాయని చాలా మంది భావిస్తారు. కానీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సమాజంలో ఉన్న బంధాలే నిజమైన ఆనందాన్ని ఇస్తాయని హార్వర్డ్ యూనివర్సిటీ చేసిన స్టడీలో తేలింది. మన అనుకునే కొద్దిమంది ఉన్నా చాలని వారితో సంతోషంగా ఉండొచ్చని పరిశోధకులు స్పష్టం చేశారు. ఆరోగ్యమే మహాభాగ్యమని అది లేకుంటే ఎంత డబ్బున్నా ప్రయోజనం లేదని పేర్కొన్నారు. నా అనుకునే వారు పక్కన ఉంటే ఆ హ్యాపీయే వేరని తెలిపారు.

News December 21, 2025

వాట్సాప్‌లో కొత్త మోసం.. జాగ్రత్త: సజ్జనార్

image

TG: వాట్సాప్‌లో ‘ఘోస్ట్ పెయిరింగ్’ పేరిట కొత్త స్కామ్ జరుగుతోందని HYD సీపీ సజ్జనార్ తెలిపారు. ‘Hey.. మీ ఫొటో చూశారా? అంటూ లింక్‌ వస్తే క్లిక్‌ చేయొద్దు. క్లిక్ చేస్తే హ్యాకర్ల డివైజ్‌కు మీ అకౌంట్ కనెక్టవుతుంది. మీ పర్సనల్ డేటా చూసి మీ పేరుతో ఇతరులకు మెసేజ్‌లు పంపి మోసం చేస్తారు. WhatsApp సెట్టింగ్స్‌లో ‘Linked Devices’ ఆప్షన్‌ను చెక్ చేసి తెలియని డివైజ్‌లు ఉంటే రిమూవ్‌ చేయండి’ అని ట్వీట్ చేశారు.