News March 30, 2025

అండర్-20 స్టేట్ ఫుట్‌బాల్ టీంకు ఎంపికైన గుత్తి విద్యార్థి

image

గుత్తిలోని శ్రీ సాయి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న సాయి శ్రీనివాస్ నారాయణ అండర్-20 స్టేట్ ఫుట్‌బాల్ టీంకు ఎంపికైనట్లు కోచ్ ప్రసాద్ శనివారం చెప్పారు. రెండు రోజుల క్రితం అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో అండర్-20 స్టేట్ ఫుట్‌బాల్ టీం సెలక్షన్స్ జరిగాయి. సాయి శ్రీనివాస్ నారాయణ అత్యంత ప్రతిభ కనబరిచాడు. దీంతో సాయి శ్రీనివాస్ నారాయణను స్టేట్ టీంకు ఎంపిక చేశారు.

Similar News

News April 1, 2025

అనంతపురం జిల్లాలో 7 కరవు మండలాలు.!

image

రబీ సీజన్‌లో ప్రభుత్వం ప్రకటించిన కరవు మండలాల జాబితాలో అనంతపురం జిల్లాలో మండలాలకు స్థానం లభించింది. 2024-25 రబీ సీజన్‌లో కరవు ప్రభావిత మండలాలను సోమవారం ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో బెళుగుప్ప, గుంతకల్లు, పెద్దవడుగూరు, తాడిపత్రి, ఎల్లనూరు, యాకిడి, విడపనకల్లు మండలాలకు స్థానం లభించింది. మిగతా మండలాలకు ఈ జాబితాలో చోటు దక్కలేదు.

News April 1, 2025

ATP: పింఛన్ పంపిణీలో పాల్గొనున్న కలెక్టర్

image

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మంగళవారం పర్యటించనున్నారు. తాళ్లకేర గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నట్లు టీడీపీ కార్యాలయం సోమవారం మీడియాకి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కలెక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పింఛన్ పంపిణీ చేయనున్నారు.

News March 31, 2025

ATP: రేపు జిల్లాస్థాయి రాతిదూలం పోటీలు

image

అనంతపురం జిల్లా యాడికి మండలం పెద్ద పేటలో మంగళవారం జూనియర్ విభాగంలో రాతిదూలం పోటీలు నిర్వహించనున్నట్లు సోమవారం నిర్వాహకులు తెలిపారు. శ్రీ సంజీవరాయ స్వామి ఉత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి నిర్వహిస్తారని అన్నారు. ఆసక్తి ఉన్న జిల్లా రైతులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చునని తెలిపారు. మొదటి బహుమతి రూ.20 వేలు, రెండో బహుమతి రూ.15 వేలు, మూడో బహుమతి రూ.10 వేలు అందజేస్తారని నిర్వాహకులు పేర్కొన్నారు. 

error: Content is protected !!