News November 12, 2025

అండ దానం గురించి తెలుసా?

image

వయసు పైబడిన మహిళలు, పదే పదే ఐ.వి.ఎఫ్‌లు ఫెయిల్‌ అయిన వాళ్లకు అండాల అవసరం ఉంటుంది. అలాగే ఆర్టిఫిషియల్‌ రిప్రొడక్టివ్‌ బ్యాంకుల నుంచి మాత్రమే అండాలను తీసుకోవలసి ఉంటుంది. గతంలో ఏ మహిళైనా, ఎన్నిసార్లైనా తమ అండాలను అమ్ముకోగలిగే వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు 23 నుంచి 35 ఏళ్ల మహిళలు మాత్రమే ఎగ్‌ డొనేషన్‌కు అర్హులు. అలాగే ఒక మహిళ తన జీవిత కాలంలో, కేవలం ఒక్కసారి మాత్రమే అండాలను డొనేట్‌ చేయాలి.

Similar News

News April 5, 2026

హిమంత క్షమాపణ కోరినా వదిలేది లేదు: రాహుల్

image

దేశంలోనే అత్యంత అవినీతి పరుడైన CM హిమంత అని INC అగ్రనేత రాహుల్ విమర్శించారు. ఆయన క్షమాపణ కోరినా వదలబోమని, తాము అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటామని తెలిపారు. అస్సాం ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ లెజెండరీ సింగర్ జుబీన్ గార్గ్ మరణానికి బాధ్యులైన వారితో CMకు సన్నిహిత సంబంధాలున్నాయని ఆరోపించారు. రాష్ట్రాన్ని విభజించి, ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి హిమంత ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

News April 5, 2026

MIకి శుభవార్త.. కోలుకున్న హార్దిక్!

image

అనారోగ్యం కారణంగా DCతో మ్యాచ్‌కు దూరమైన MI కెప్టెన్ హార్దిక్ కోలుకున్నట్లు సమాచారం. ఎల్లుండి రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఆయన ఆడనున్నట్లు తెలుస్తోంది. కాగా KKRపై గెలిచిన ముంబై నిన్న DC చేతిలో ఓడిన విషయం తెలిసిందే.

News April 5, 2026

జగన్ అబద్ధం ఆడుతున్నారు: TDP

image

AP: రాజధాని అమరావతిలో చదరపు అడుగుకు రూ.12,000 ఖర్చవుతుందని జగన్ అబద్ధం చెబుతున్నారని TDP ఓ ఫొటోను ట్వీట్ చేసింది. అలా అనుకున్నా విలాసాలకు ఆయన కట్టుకున్న రుషికొండ ప్యాలెస్ చ.అడుగుకి రూ.35,714 అయ్యిందని విమర్శించింది. దీనికి జగన్ ఏమని జవాబు చెబుతారని ప్రశ్నించింది. ఇక అబద్ధంతో బతుకుతూ, విద్వేషం చిమ్ముతూ అమరావతి విషయంలో ఒక్కడినే ఇంకో వైపు అనుకోవటం మానసిక స్థితిని తెలియజేస్తుందని ఎద్దేవా చేసింది.