News December 19, 2025

‘అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించాలి’

image

జిల్లాలో వినియోగదారులకు అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలని NPDCL సంచాలకులు మధుసూదన్ అన్నారు. శుక్రవారం ASF కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీఈ అశోక్, ఎస్ఈ ఉత్తం జాడేతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యుత్ లైన్ల నిర్వహణ సమర్థవంతంగా చేపట్టి వినియోగదారులకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని పేర్కొన్నారు.

Similar News

News December 20, 2025

వేములవాడ: పాత టెండర్లకు మంగళం.. 30న కొత్తవాటికి పిలుపు

image

వేములవాడ రాజన్న ఆలయంలో పాత టెండర్లను రద్దు చేశారు. అభివృద్ధి పనుల నేపథ్యంలో రాజన్న దర్శనాలను నిలిపివేసి భీమేశ్వరాలయానికి మార్చిన నేపథ్యంలో టెండర్లు రద్దు చేయాలని కాంట్రాక్టర్లు విజ్ఞప్తి చేశారు. దీంతో కొబ్బరి ముక్కల సేకరణ, బెల్లం, పూజా సామగ్రి విక్రయం, లాకర్ల నిర్వహణ తదితరాల టెండర్లను క్యాన్సిల్ చేశారు. భీమన్న ఆలయంలో కొత్తగా దుకాణాలు ఏర్పాటు చేయడానికి వీలుగా ఈనెల 30న కొత్త టెండర్లను పిలవనున్నారు.

News December 20, 2025

ఖమ్మం ప్రయాణికులకు రైల్వే శాఖ తీపి కబురు

image

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్‌ 22న మచిలీపట్నం నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్లే వన్-వే స్పెషల్ రైలు (07401)కు ఖమ్మం రైల్వే స్టేషన్‌లో హాల్టింగ్ కల్పించారు. ఈ ప్రత్యేక రైలు గుడివాడ, విజయవాడ మీదుగా ప్రయాణిస్తూ ఖమ్మం చేరుకుంటుంది. ఇక్కడితో పాటు వరంగల్ స్టేషన్‌లోనూ ఈ రైలు ఆగుతుందని అధికారులు వెల్లడించారు.

News December 20, 2025

మల్లన్న భక్తులకు ఊరట

image

శ్రీశైల మల్లన్న స్పర్శ దర్శనాల సమయం పెంచుతున్నట్లు ప్రకటించడం భక్తులకు ఊరటనిచ్చే విషయం. జనవరి నుంచి వీకెండ్స్‌లో 6 స్లాట్లలో భక్తులకు లింగాన్ని తాకి దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తామని EO వెల్లడించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే శని, ఆది, సోమవారాల్లో 7am-8:30am, 11:45am-2pm, 9pm-11pm స్లాట్లలో స్పర్శ దర్శనం ఉంటుంది. HYD, ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగులు, ఫ్యామిలీస్ వీకెండ్‌లో ఎక్కువగా వెళ్తున్నారు.