News August 21, 2024

అంతరాష్ట్ర దొంగల్ని అరెస్ట్ చేసిన గుంటూరు పోలీసులు

image

అంతర్రాష్ట్ర దొంగల ముఠాని గుంటూరు సీసీఎస్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. అబ్బినేనిగుంట వారిపాలెం అడ్డరోడ్డు వద్ద ముగ్గురు నిందితులను పట్టుకొని వారి నుంచి రూ.4,94,500 విలువైన బంగారు, వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ సతీశ్ కుమార్ ఆదేశాల మేరకు నేరవిభాగం అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, సీసీఎస్ డీఎస్పీ శివాజీ పర్యవేక్షణలో ఇన్స్ పెక్టర్ V.చౌదరి‌, ఎస్సై రాజ్ కుమార్ నిందితులను పట్టుకున్నారు.

Similar News

News February 26, 2026

తెనాలిలో రేపు ఆయేషా మీరా అంత్యక్రియలు

image

ఆయేషా మీరా అస్థికలను సీబీఐ ఆమె తల్లిదండ్రులకు అప్పగించనుంది. రేపు తెనాలిలో భారీ బందోబస్తు నడుమ ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కేసులో దర్యాప్తు సంస్థలన్నీ విఫలమయ్యాయని ఆయేషా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు తమకు న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కేసును హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని, డిసెంబర్ 27ను ఆయేషా సంస్మరణ దినంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.

News February 26, 2026

గుంటూరు: డ్రంక్ & డ్రైవ్‌లో ఒకరికి జైలు శిక్ష

image

గుంటూరు ట్రాఫిక్ విభాగం నగరంలో ముమ్మరంగా డ్రంక్ & డ్రైవ్ తనిఖీలు నిర్వహించింది. గుంటూరు వెస్ట్ ట్రాఫిక్ సీఐ సింగయ్య ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో 10 మంది వాహనదారులు పట్టుబడ్డారు. వారిలో ముగ్గురికి రూ.7,000ల చొప్పున, ఆరుగురికి రూ.5,000ల చొప్పున జరిమానా విధించారు. ఒకరికి 3 రోజుల జైలు శిక్ష విధించారు. మొత్తం రూ.51,000 జరిమానా వసూలైందని, ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని పోలీసులు హెచ్చరించారు.