News August 27, 2025
అంతర్గాం: గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్త

అంతర్గాం (M) శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. 7 గేట్ల ద్వారా 55, 531 క్యూసెక్కుల నీటిని దిగువనకు వదులుతున్నారు. దీంతో నది పరివాహక ప్రాంతాలలో ఉన్న గ్రామాలు ప్రజలు, మత్స్యకారులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎవరు నది వైపునకు వెళ్ళవద్దని సూచిస్తున్నారు.
Similar News
News August 28, 2025
భారీ వర్షాలు.. పలు రైళ్ల రద్దు

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఇవాళ కాచిగూడ-నాగర్సోల్, కాచిగూడ-కరీంనగర్, కరీంనగర్-కాచిగూడ, మెదక్-కాచిగూడ, బోధన్-కాచిగూడ, కాచిగూడ-నర్ఖేడ్, నాందేడ్-మేడ్చల్ ట్రైన్లను, రేపు నర్ఖేడ్-కాచిగూడ, నాగర్సోల్-కాచిగూడ రైళ్ల సేవలు రద్దు చేసినట్లు పేర్కొంది. పలు రైళ్లు దారి మళ్లింపు, పాక్షికంగా క్యాన్సిల్ చేసినట్లు వివరించింది.
News August 28, 2025
కొనసాగుతున్న అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఇవాళ అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. మన్యం, కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడులో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అల్పపీడనం ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వైపు కదిలే అవకాశం ఉందని వివరించింది.
News August 28, 2025
సంగారెడ్డి: మోడల్ స్కూల్స్‌లో స్పాట్ అడ్మిషన్లు

జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మోడల్ స్కూల్స్‌లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ఇటీవల 2025-26 విద్యా సంవత్సరానికి మోడల్ స్కూల్స్‌లో ఆరు నుంచి పదో తరగతి వరకు అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్షను నిర్వహించారు. జిల్లాలోని మునిపల్లి, పోతులబొగూడ తదితర పాఠశాలలో ఇంకా సీట్లు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు.