News November 1, 2025
అంతర్గాం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన సీపీ

రామగుండం కమిషనర్ పరిధిలోని అంతర్గాం పోలీస్ స్టేషన్ ను సీపీ అంబర్ కిషోర్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించడంతో పాటు, స్టేషన్ భౌగోళిక పరిస్థితులు, సిబ్బంది పనీతీరు, స్టేషన్ పరిధిలో అధికంగా నమోదయ్యే కేసుల వివరాలతో పాటు, గ్రామాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రిసెప్షన్ సిబ్బందితో మాట్లాడి రికార్డ్ లను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పెండింగ్ కేసులపై సీపీ ఆరా తీశారు.
Similar News
News November 2, 2025
టుడే హెడ్ లైన్స్

* శ్రీకాకుళంలోని కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట.. 9 మంది మృతి
* మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున సాయం: మంత్రి లోకేశ్
* ప్రైవేటు ఆలయం అంటూ తప్పించుకోవాలని ప్రభుత్వం యత్నిస్తోంది.: జగన్
* బోరబండ చౌరస్తాకు PJR పేరు పెడతాం: రేవంత్
* 85% మెడికల్ పీజీ మేనేజ్‌మెంట్ కోటా సీట్లు స్థానికులకే: దామోదర
* జూబ్లీహిల్స్ బైపోల్‌లో BRSకే గెలుపు అవకాశం: KK సర్వే
News November 2, 2025
మహేశ్-రాజమౌళి డిఫరెంట్ ప్రమోషన్స్

మహేశ్-రాజమౌళి SSMB29 మూవీని చాలా కొత్తగా ప్రమోట్ చేశారు. ‘ఆల్రెడీ NOV వచ్చేసింది.. ఏదో రిలీజ్ చేస్తానన్నారు’ అని మహేశ్ ట్వీట్ చేయడంతో టాపిక్ స్టార్టైంది. ‘చిన్నగా ఒక్కోటి రిలీజ్ చేద్దాం’ అని జక్కన్న అన్నారు. ‘సర్‌ప్రైజ్ ఆ.. పృథ్వీరాజ్ కూడా సర్‌ప్రైజ్ అంటారా?’ అని మూవీలో పృథ్వీరాజ్ ఉన్నారని, రేపు ఆయన పోస్టర్ రిలీజ్ కానుందని చాటింగ్‌లో చెప్పేశారు. ఈ <
News November 2, 2025
ఎందరో నియంతలు పతనమయ్యారు.. తర్వాత రేవంతే: KTR

TG: రేవంత్ నకిలీ వాగ్దానాలు, బెదిరింపు రాజకీయాలు జూబ్లీహిల్స్ ఓటమితోనే అంతమవుతాయని KTR వ్యాఖ్యానించారు. ‘500 రోజుల్లో KCR తిరిగి సీఎం అవుతారు. ఎందరో నియంతలు పతనమయ్యారు.. తర్వాత రేవంతే. జూబ్లీహిల్స్‌లో భారీ మెజార్టీతో గెలుస్తాం. రేవంత్ చేసే బెదిరింపు రాజకీయాలకు భయపడేది లేదు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పతనం ఖాయం. రేవంత్‌కు కాంగ్రెస్‌తో ఉన్నది ఫేక్ బంధం. BJPతో ఉన్నది పేగు బంధం’ అని విమర్శించారు.


