News August 28, 2025
అంతర్గాం: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అప్డేట్

అంతర్గాం(M) శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద చేరుతోంది. 40 గేట్లు ఎత్తి 4 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు పంపిస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు, మత్స్యకారులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు.
Similar News
News August 28, 2025
కుప్పానికి సీఎం.. షెడ్యూల్ ఇదే.!

సీఎం చంద్రబాబు 29వ తేదీ సాయంత్రం 6:30 గం.తుమ్మిసి హెలిపాడ్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి శివపురంలోని సొంతింటికి చేరుకుంటారు. రాత్రి 7:30 గం.కు కడ అడ్వైజరి కమిటీతో సమావేశం, రాత్రి సొంతింట్లో బస చేస్తారు. 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఆర్టీసీ బస్సులో పరమసముద్రంకు వస్తూ వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో చర్చించనున్నారు. 11:30 గంటలకు హంద్రీనీవాకు జల హారతి, 11:55 గం.కు పబ్లిక్ మీటింగ్లో ప్రసంగిస్తారు.
News August 28, 2025
MTM: మెగా డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

మెగా డీఎస్సీలో అర్హత సాధించిన కృష్ణా జిల్లా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన గురువారం మచిలీపట్నంలోని నోబుల్ కళాశాలలో జరిగింది. 1048 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు తెలిపారు. ఈ తనిఖీ కోసం ఐదుగురు సభ్యులతో కూడిన ఎంఈఓ, రెవెన్యూ శాఖల బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు.
News August 28, 2025
MNCL: బీజేపీ జిల్లా నూతన కార్యవర్గం నియామకం

బీజేపీ జిల్లా నూతన కార్యవర్గాన్ని నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆదేశాల మేరకు జిల్లా కమిటీలో ఆరుగురు ఉపాధ్యక్షులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, ఒక కోశాధికారి, జిల్లా కార్యాలయ కార్యదర్శి, సోషల్ మీడియా, ఐటీ కన్వీనర్లతో పాటు 45 మంది జిల్లా కార్యవర్గ సభ్యులు, 10 మంది శాశ్వత ఆహ్వానితులను నియమించినట్లు పేర్కొన్నారు.