News September 12, 2025
అంతర్గాం: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు UPDATE

అంతర్గాం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో వరద నీటి ప్రవాహం నిలకడగా ఉంది. శుక్రవారం ఉదయం నాటికి ఇన్‌ఫ్లో 72,866 క్యూసెక్కులుగా ఉంది. అవుట్‌ఫ్లో 65,144 క్యూసెక్కులు, ప్రాజెక్ట్ సామర్థ్యం 20.175 TMCలుగా ఉంది. ప్రస్తుత నీటి నిల్వ 18.9806 TMCలు, లెవెల్: 147.58/148.00 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టుకు 12 గేట్ల ద్వారా 64,716 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు పంపిస్తున్నారు.
Similar News
News March 3, 2026
ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్ దాడి

ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ‘కచ్చితమైన నిఘా సమాచారం ఆధారంగా టెహ్రాన్‌లోని ప్రభుత్వ లీడర్‌షిప్ కాంపౌండ్‌పై అటాక్ చేశాం. అధ్యక్ష కార్యాలయం, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్, మిలిటరీ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌పై బాంబులు వేశాం’ అని ఓ ప్రకటనలో IDF తెలిపింది.
News March 3, 2026
MDK: లవ్ ఫెయిల్.. యువతి ఆత్మహత్య!

మియాపూర్‌లో నివసిస్తున్న నర్సు (20) ప్రేమ విఫలమై హాస్టల్ గదిలో ఆత్మహత్మ చేసుకుంది. పోలీసుల వివరాలిలా.. మెదక్ జిల్లాకు చెందిన ఈమె స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తుంది. ఏడాది కాలంగా ఓ యువకుడితో ప్రేమలో ఉన్న ఆమె, వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 3, 2026
అన్నమయ్య: యూట్యూబ్ చూసి బైక్‌ల చోరీలు..

పీలేరు మండలం పొంతలచెరువు క్రాస్ వద్ద వాహనాల తనిఖీలలో పోలీసులు నలుగురు అంతర్ జిల్లా బైక్ దొంగలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి అన్నమయ్య, చిత్తూరు, కడప, తిరుపతి జిల్లాల్లో చోరీ చేసిన రూ.40 లక్షల విలువైన 24 బైకులను స్వాధీనం చేసుకున్నారు. యూట్యూబ్ వీడియోలు చూసి చోరీలకు పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారని తెలిపారు. వాహనాలు రికవరీ చేసిన సిబ్బందిని అన్నమయ్య జిల్లా SP ధీరజ్ కునుబిల్లీ అభినందించారు.


