News October 22, 2024

అంతర్జాతీయ కశ్మీర్ మారథాన్‌లో మెరిసిన అల్లూరి జిల్లా యువకుడు

image

కశ్మీర్ మారథాన్‌లో అల్లూరి జిల్లా యువకుడు మెరిశాడు. ఈ నెల 20న కశ్మీర్ స్పోర్ట్స్ కౌన్సిల్ & కశ్మీర్ టూరిజం కలిసి నిర్వహించిన 42 కి.మీ. అంతర్జాతీయ కశ్మీర్ మారథాన్‌లో అరకులోయ మండలం గరడగూడకు చెందిన కిల్లో బుద్దు ప్రతిభ కనబరిచారు. 2000 మంది పాల్గొన్న ఈ మారథాన్‌లో కిల్లో బుద్దు 9వ స్థానం సాధించినట్లు ఆయన తెలిపారు. దీంతో ఆయన సన్నిహితులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.

Similar News

News September 19, 2025

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఢిల్లీ అధికారులు

image

ఢిల్లీ నుంచి స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్, జాయింట్ సెక్రెటరీలు విశాఖ చేరుకున్నారు. వారు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నేడు సందర్శించనున్నారు. ఉత్పత్తి తగ్గుదల, బొగ్గు సమస్యపై అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం ఎంపిక చేసిన అధికార ఉద్యోగ బృందాలతో సమావేశమౌతారు. స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం ప్యాకేజీ ఇచ్చిన తర్వాత ప్రతి మూడు నెలలకోసారి సమీక్షల్లో భాగంగా వస్తున్నట్లు సమాచారం.

News September 19, 2025

విశాఖ: గోల్డ్ డిపాజిట్ పేరుతో మోసం.. ముగ్గురి అరెస్టు

image

వన్ టౌన్‌లో నివాసం ఉంటున్న నవీన్ కుమార్ దంపతులను గోల్డ్ డిపాజిట్ పేరుతో మోసం చేసిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు సీఐ జీడి బాబు తెలిపారు. బాధితులకు గోల్డ్ ఇస్తామని రూ.3 కోట్లు తీసుకొని ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పారు. నిందితులు దామోదర నాయుడు, ఉమామహేశ్వరరావు, దిలీప్‌లను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఎవరైనా బాధితులు ఉంటే నేరుగా వన్ టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేయాలన్నారు.

News September 18, 2025

విశాఖలో 524 ఆక్రమణల తొలగింపు

image

విశాఖలో ఆపరేషన్ లంగ్స్‌లో భాగంగా 524 ఆక్రమణల తొలగించారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు ఆపరేషన్ లంగ్స్ చేపట్టినట్లు చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకర రావు గురువారం తెలిపారు. జోన్ 1లో 20 ఆక్రమణలు, జోన్-2 90, జోన్ -3లో 42, జోన్ -4 60, జోన్ -5లో 52, జోన్-6లో 86, జోన్ – 7లో 42, జోన్-8లో 67 ఆక్రమణలు తొలగించారు.