News April 13, 2025

అంతర్జాతీయ సదస్సుకు ఎంపికైన రీసర్చ్ పేపర్

image

కురవికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు భూముల రాజేష్ రూపొందించిన యాక్షన్ రీసర్చ్ పేపర్ అంతర్జాతీయ ఇంగ్లీష్ సదస్సుకు ఎంపికైంది. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ టీచర్స్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏఫారెన్ లాంగ్వేజ్ (IAETFL) వారు ప్రతిఏటా నిర్వహించే సదస్సుకు శనివారం ఆయన తన పరిశోధన పత్రాన్ని సమర్పించారు. రీసర్చ్ పేపర్ ఎంపిక కావడంపై జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులు హర్షంవ్యక్తం చేశారు.

Similar News

News October 16, 2025

అక్టోబర్ 21 నుంచి వ్యాసరచన పోటీలు: ఎస్పీ రాజేశ్ చంద్ర

image

కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ 21 నుంచి 31 వరకు జరిగే పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు అక్టోబర్ 21 నుంచి 28 వరకు ఆన్‌లైన్‌లో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో నిర్వహించే ఈ పోటీల్లో డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర, విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండటం అనే అంశాలపై రాయాలని సూచించారు.

News October 16, 2025

వందేళ్ల ప్రస్థానం: ఆంధ్రా వర్సిటీ వైభవం

image

ఆంధ్ర విశ్వకళాపరిషత్ (ఏయూ) ఒక విజ్ఞాన ఖని. ఆర్ట్స్, సైన్స్, ఇంజినీరింగ్ వంటి విభాగాల్లో నాణ్యమైన విద్యను ఏయూ అందిస్తోంది. మెరైన్, బయాలజీ వంటి ప్రత్యేక కోర్సులకు నిలయం. వెంకయ్య నాయుడు, విశ్వనాథ సత్యనారాయణ వంటి మహామహులు ఇక్కడి పూర్వ విద్యార్థులే. శతాబ్ద కాలంగా ఈ విజ్ఞాన ఖని బాధ్యతగల పౌరులను, నాయకులను తీర్చిదిద్దుతూ ఆంధ్రుల గర్వకారణంగా నిలుస్తోంది.

News October 16, 2025

శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ సందర్శించిన నాగబాబు

image

శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ను ఎమ్మెల్సీ నాగబాబు సందర్శించారు. కాంప్లెక్స్ ఆవరణలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వర్షపు నీరు నిల్వతో ప్రయాణికులకు ఇబ్బందిగా మారడంపై ఆరా తీస్తున్నారు. తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందితో చర్చించారు. ఆయన వెంట సుడా ఛైర్మన్ కొరికాన రవికుమార్, నాయకులు ఉన్నారు.