News January 30, 2026
అంతర్వేదిలో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

అంతర్వేది PNM కాలనీ మెయిన్ రోడ్డుపై శుక్రవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రావులపాలెం, కొత్తపేట ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువకులు బైక్ పై అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చారని స్థానికులు తెలిపారు. తిరిగి వెళుతుండగా పశువులను ఢీ కొట్టి ప్రమాదానికి గురయ్యారన్నారు.
Similar News
News February 16, 2026
జనగామ మున్సిపాలిటీ కార్యాలయ పరిధిలో నిషేధాజ్ఞలు

జనగామ మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎంపిక నేపథ్యంలో జనగామ మున్సిపల్ కార్యాలయం వద్ద భద్రత ఏర్పాటు చేసినట్లు CP సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. మున్సిపల్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో బీఎన్‌ఎస్ 163 ప్రకారం నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు ఇవి అమలులో ఉంటాయని, ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నేరమని హెచ్చరించారు.
News February 16, 2026
కోదాడ: లాకప్ డెత్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: జాతీయ ఎస్సీ కమిషన్

దళితుల రక్షణకు కమిషన్ కట్టుబడి ఉందని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచంద్రరావు అన్నారు. కోదాడ లాకప్ డెత్ బాధితుడు రాజేశ్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, 10 రోజుల్లో రీ-పోస్టుమార్టం నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి పెన్షన్, ఇల్లు, మూడు ఎకరాల భూమి అందజేస్తామని హామీ ఇచ్చారు.
News February 16, 2026
విద్యుత్ ‘కట్‘కటా లేకుండా ఏర్పాట్లు

TG: ఎల్‌నినో కారణంగా ఈ ఏడాది ఎండలు తీవ్రమై రాష్ట్ర విద్యుత్ డిమాండ్ 18000 MW వరకు పెరగొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. గ్రేటర్ HYDలోనే ఈసారి 4000 MW అవసరమని, యాసంగి(ఏప్రిల్, మే)లో సాగుకు వినియోగం పెరుగుతుందని భావిస్తోంది. దీనికి తగ్గట్టుగా యాదాద్రి ప్లాంటులో 4000 MW ఉత్పత్తికి చర్యలు తీసుకుంది. పీక్ అవర్‌లో విద్యుత్ రేట్లు భారీగా ఉన్నా కొనుగోలుకు రెడీ అవుతోంది. 2025లో 17500 MW డిమాండ్ ఉంది.


