News January 31, 2025

అంతర్వేది వరకు బస్సులు నడపాలని వినతి

image

అంతర్వేది కళ్యాణోత్సవాలకు స్పెషల్ బస్సుల పేరుతో అధిక చార్జీలు వసూలు చేయరాదని బజరంగ్ దళ్ నాయకుడు శిరంగు నాయుడు కోరారు. అమలాపురం నుంచి మలికిపురం వరకే కాకుండా అంతర్వేది వరకు పూర్తిస్థాయిలో బస్సులు నడపాలని విన్నవించారు. ఈ మేరకు ఆయన అమలాపురం ఆర్టీసీ డిపో మేనేజర్ చర్ల సూర్యనారాయణను శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. భక్తులు రద్దీకి తగ్గట్టుగా పూర్తిస్థాయిలో బస్సులు నడపాలని కోరారు.

Similar News

News July 7, 2025

పెద్దపల్లి యువతకు ఫ్యాషన్ డిజైనింగ్ శిక్షణ అవకాశం

image

పెద్దపల్లిలో జిల్లాలో ఇంటీరియర్ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు ప్రారంభించనున్నట్లు మహిళా, శిశు, వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ తెలిపింది.. ఈ కోర్సులకు జ్యోతినగర్, NTPC, GDKలో ఈ శిక్షణ ఇస్తారు. INTER పాసైన యువత దీనికి అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు జూలై 8లోపు జిల్లా సంక్షేమాధికారి కార్యాలయం, గది నం.114లో దరఖాస్తు చేయాలి. మరిన్ని వివరాలకు https://peddapalli.telangana.gov.in చూడవచ్చు

News July 7, 2025

కామారెడ్డి జిల్లాలో 4 పాఠశాలలు రీ ఓపెన్

image

కామారెడ్డి జిల్లాలో మూతబడిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను తిరిగి ప్రారంభించేందు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జీరో ఎన్‌రోల్‌మెంట్‌తో పాటు పిల్లలను చేర్పించడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపకపోవడంతో పాఠశాలలను మూసివేశారు. బిక్కనూర్(M) మోటాట్‌పల్లి, జుక్కల్(M)మధురతండా, మాచారెడ్డి(M) నెమ్లిగుట్టతండా, సదాశివనగర్(M) దగ్గిలో మంగళవారం పాఠశాలలను రీ ఓపెన్ చేయనున్నారు.

News July 7, 2025

శాకాంబరీ ఉత్సవాల్లో భద్రకాళి అమ్మవారి దర్శనం

image

వరంగల్ భద్రకాళి దేవస్థానంలో నిర్వహిస్తున్న శాకాంబరీ మహోత్సవాల్లో భాగంగా పన్నెండవ రోజు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆషాఢ మాసం ద్వాదశి తిథి సోమవారం ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు చేసి హారతినిచ్చారు. భక్తులు ఉదయం నుంచి ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.