News December 29, 2025
అంతర్వేది వేడుకలకు సర్వం సిద్ధం చేయాలి: కలెక్టర్

అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవ ఏర్పాట్లపై సోమవారం అధికారులతో సమీక్షించారు. జనవరిలో జరిగే ఈ వేడుకలకు భక్తులు భారీగా వస్తారని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తాగునీరు, పారిశుధ్యం, క్యూలైన్ల నిర్వహణలో ఎక్కడా లోటుపాట్లు ఉండకూడదని, భక్తులకు అసౌకర్యం కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News December 31, 2025
MHBD: తండ్రి డబ్బులివ్వలేదని కొడుకు ఆత్మహత్య

నెల్లికుదురు మండలం మేచరాజుపల్లిలో విషాదం నెలకొంది. తండ్రి డబ్బులు ఇవ్వలేదన్న మనస్తాపంతో కొడుకు పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్సై రమేశ్ బాబు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన రాకేష్ తన తండ్రి సంతోష్‌ను రూ.లక్ష అడిగాడు. ప్రస్తుతం తన వద్ద లేవని, రేపు ఇస్తానని తండ్రి చెప్పడంతో క్షణికావేశానికి లోనైన రాకేష్ పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు.
News December 31, 2025
అమరావతి జిల్లా లేనట్లేనా.?

అమరావతి జిల్లాగా మారుతుందని ఎంతగానో ఎదురుచూసిన వారి ఆశలు అడియాసలుగా మారాయి. APలో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటుకు, సోమవారం క్యాబినెట్ ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. అయితే ఊహించని విధంగా డిసెంబర్ 31 నుంచి 2 కొత్త జిల్లాలు అమల్లోకి రానున్నాయి. కొత్త ఏడాది తర్వాత ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ముందుగా భావించినప్పటికీ.. ముందే ఏర్పాటును అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో అమరావతి జిల్లా కలగానే మిగిలిందంటున్నారు.
News December 31, 2025
2025 క్రైమ్ రిపోర్టు: హత్యలు 54, కిడ్నాప్‌లు 25

శ్రీ సత్యసాయి జిల్లాలో 2025లో మొత్తం 4,028 కేసులు నమోదయ్యాయని ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే నేరాలు 2 శాతం పెరిగాయని చెప్పారు. రోడ్డు ప్రమాద మరణాలు 340 నుంచి 303కు తగ్గాయి. హత్యలు 54, కిడ్నాప్‌లు 25గా నమోదయ్యాయి. మహిళలపై నేరాలు 26.3 శాతం పెరిగాయి. ఈ-చలాన్ల ద్వారా రూ.1.01 కోట్ల జరిమానా వసూలు చేశారు. హిందూపురం బ్యాంకు చోరీ కేసులో రూ.5.5 కోట్ల బంగారాన్ని పోలీసులు <<18718838>>రికవరీ<<>> చేశారు.


