News May 7, 2025
అంతర్ జిల్లాల బదిలీలు చేయాలి: ఏపీటీఎఫ్

ప్రభుత్వ ఉపాధ్యాయులకు అంతర్ జిల్లా బదిలీలు చేయాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.సింహాచలం, బి.జోగినాయుడు డిమాండ్ చేశారు. బొబ్బిలి పట్టణంలో శనివారం వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులకు అంతర్ జిల్లాల బదిలీలు చేసి స్పోజ్ కేటగిరీలో ఎంటీఎస్ టీచర్లను పరిగణించాలన్నారు. 1998/2008 ఎంటీఎస్ టీచర్ల బదిలీలు కూడా రెగ్యులర్ టీచర్లతో చేయాలన్నారు. సింగిల్ టీచర్ పాఠశాలలకు రెండో టీచర్‌ను నియమించాలన్నారు.
Similar News
News May 8, 2025
VZM: పతకాలు సాధించిన పోలీసులకు ఎస్పీ అభినందన

ఇటీవల కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళంలో నిర్వహించిన జాతీయస్థాయి డెడ్ లిఫ్ట్ & బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ పోటీల్లో వన్ టౌన్ ASI త్రినాథ్, విశ్రాంత HC శంకర్రావు పతకాలు సాధించారు. వారు గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో SP వకుల్ జిందల్‌ను కలిశారు. ఎస్పీ వాళ్ల ప్రతిభను అభినందించి క్రీడాస్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు. 4 బంగారు పతకాలు, 4 వెండి పతకాలు సాధించడం అభినందనీయమన్నారు.
News May 7, 2025
ఎండ తీవ్రత లేని సమయంలో పనులు నిర్వహించాలి: కలెక్టర్

ఉపాధి వేతనదారులకు దినసరి వేతనం పెరిగేలా పనులు చేయించాలని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉపాధి పనుల తీరు, వేతనదారులు అందుకుంటున్న సగటు వేతనంపై సమీక్షించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఎండ తీవ్రత లేని సమయంలో పనులు నిర్వహించాలని చెప్పారు. ఉదయాన్నే వీలైనంత వేగంగా పని మొదలయ్యేలా చూడాలన్నారు. రెండుపూటలా కనీసం 6 గంటలు పనులు చేయించాలని ఆదేశించారు.
News May 7, 2025
భోగాపురం మండలంలో ముగ్గురు ఫీల్డ్ అసిస్టెంట్లు సస్పెండ్

భోగాపురం మండలంలోని పోలిపల్లి, కౌలువాడ, లింగాలవలసలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేస్తూ డ్వామా పీడీ శారదా కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సామాజిక తనిఖీల్లో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ కావడంతో వారిపై చర్యలు తీసుకున్నారని ఏపీఓ భాగ్యలక్ష్మి తెలిపారు. ఆయా గ్రామాల్లో ఉపాధి పనులకు ఆటంకం లేకుండా చర్యలు చేపట్టామని చెప్పారు.