News April 14, 2025
అందరికీ దిశానిర్దేశకులు అంబేడ్కర్: ASP

సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు దిశానిర్దేశం చేసిన గొప్ప వ్యక్తి బీఆర్ అంబేడ్కర్ అని నెల్లూరు అడిషనల్ ఎస్పీ సీహెచ్ సౌజన్య పేర్కొన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. భారతదేశంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన వ్యక్తి అంబేడ్కర్ అని కొనియాడారు. పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News April 15, 2025
నెల్లూరులో కానిస్టేబుల్ భార్య సూసైడ్

నెల్లూరులో విషాద ఘటన వెలుగు చూసింది. చిన్నబజారు Ci కోటేశ్వరరావు వివరాల మేరకు.. AR కానిస్టేబుల్ నాగరాజు తన భార్య పూర్ణిమతో కలిసి ములాపేట పోలీస్ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. వీరికి ఏడాది క్రితమే వివాహమైంది. ఈక్రమంలో ఇంట్లోనే పూర్ణిమ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నాగరాజు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఆయన మొదటి భార్య సైతం ఉరేసుకుని చనిపోయారని తెలుస్తోంది.
News April 15, 2025
నెల్లూరు: ఇంజినీరింగ్ విద్యార్థులకు గమనిక

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2025-26 ఇంజినీరింగ్ విద్యార్థులకు సమ్మర్ ఆన్‌లైన్ షార్ట్ టర్మ్ ఇంటర్న్‌షిప్ నిర్వహిస్తున్నామని నెల్లూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థ మేనేజర్ అబ్దుల్ ఖయ్యూం ఓ ప్రకటనలో తెలిపారు. 2 నెలలపాటు శిక్షణ ఉంటుందని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
News April 15, 2025
నెల్లూరు చిన్నారుల గిన్నిస్ రికార్డ్

నెల్లూరుకు చెందిన రియో(9), జియాన్ (6) గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. హైదరాబాద్‌లోని హల్లెల్ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో 2024 డిసెంబర్ 1న జరిగిన మ్యూజిక్ విభాగం కీబోర్డ్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ మూడు స్వరాలను 45 సెకండ్లలో పాడి రికార్డు సృష్టించారు. సోమవారం హైదరాబాద్‌లో ఆ చిన్నారులకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సర్టిఫికెట్లను ఆ సంస్థ ప్రతినిధులు అందజేశారు.