News December 30, 2025

అందరికీ AI: ప్రభుత్వం సరికొత్త ప్లాన్!

image

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కేవలం కొందరికే పరిమితం కాకుండా, సామాన్యులకూ అందుబాటులోకి రావాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ‘AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’పై శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. నగరాలకే పరిమితం కాకుండా గ్రామాల్లోని వారూ లోకల్ భాషల్లో AI టూల్స్ తయారు చేసుకునేలా.. కంప్యూటింగ్ పవర్, డేటాను అందరికీ షేర్ చేయడమే ఈ ప్లాన్ ముఖ్య ఉద్దేశం.

Similar News

News December 30, 2025

‘12 గ్రేప్స్ థియరీ’.. ఈ సెంటిమెంట్ గురించి తెలుసా?

image

కొత్త ఏడాది అంతా మంచి జరగాలని కోరుకుంటూ పాటించే సెంటిమెంట్లలో ‘12 గ్రేప్స్ థియరీ’ ఒకటి. స్పెయిన్ సంప్రదాయం ప్రకారం డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకు నిమిషానికి ఒకటి చొప్పున 12 ద్రాక్ష పండ్లను తినాలి. ఒక్కో పండు ఏడాదిలోని ఒక్కో నెలకు సంకేతం. ఇలా తింటూ బలంగా సంకల్పించుకుంటే ఆ ఏడాదంతా అదృష్టం, ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయని చాలామంది నమ్ముతుంటారు. న్యూఇయర్ వేళ SMలో ఈ మేనిఫెస్టేషన్ ట్రెండ్ వైరలవుతోంది.

News December 30, 2025

గ్రూప్1: JAN 22న తీర్పు

image

తెలంగాణ గ్రూప్1 సెలక్షన్ లిస్టుపై హైకోర్టు JAN 22న తీర్పు ఇవ్వనుంది. లిస్టుపై కొందరు అభ్యర్థులు HCకి వెళ్లగా జాబితాను సింగిల్ బెంచ్ రద్దు చేసింది. దీనిపై TGPSC అప్పీల్‌కు వెళ్లడంతో, రద్దు తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. తాజాగా CJ బెంచ్ ఇరు పక్షాల వాదనలు నమోదు చేసింది. తప్పుల తడకగా ఎగ్జామ్ జరిగిందని సెలక్ట్ కాని అభ్యర్థులు ఆరోపించగా, అంతా రూల్స్ ప్రకారమే జరిగిందని కమిషన్ వివరణ ఇచ్చింది.

News December 30, 2025

ఇతిహాసాలు క్విజ్ – 112 సమాధానం

image

ఈరోజు ప్రశ్న: జరాసంధుడికి ఆ పేరు ఎలా వచ్చింది?
సమాధానం: జరాసంధుడు బృహద్రథుడి కుమారుడు. బృహద్రథుడికి ఇద్దరు భార్యలు. వారిద్దరూ సగం శిశువుకు జన్మనిచ్చారు. వింతగా ఉన్న ఆ శరీర భాగాలను బయట పారేయగా, ‘జర’ అనే రాక్షసి వాటిని దగ్గరకు చేర్చి కలిపింది. ఆ రెండు సగ భాగాలు అతుక్కుని పరిపూర్ణ బాలుడిగా మార్చింది. ‘జర’ అనే రాక్షసి ఆ శరీర భాగాలను సంధించడం వల్ల అతనికి ‘జరాసంధుడు’ అనే పేరు వచ్చింది.
<<-se>>#Ithihasaluquiz<<>>