News August 28, 2025

అందరి చూపు విశాఖ వైపే..!

image

అమరావతి నుంచి విశాఖ వైపు రాజకీయ నాయకులు, అధికారుల దృష్టి మళ్లింది. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మూడు రోజుల పర్యటనలో ఉండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ శుక్రవారం విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరు కానున్నారు. ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి విశాఖకు మరిన్ని వరాలు ప్రకటిస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు.

Similar News

News August 28, 2025

సాగర్ తీరంలో ప్రో కబడ్డీ టీమ్‌లు

image

విశాఖ సాగర్ తీరంలోని సబ్ మెరైన్ మ్యూజియం వద్ద ప్రో కబడ్డీ ప్లేయర్స్ సందడి చేశారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న టోర్నీకి సంబంధించిన పోస్టర్‌ను 12 టీమ్‌ల కెప్టెన్లు విడుదల చేశారు. పోస్టర్‌తో పాటు లీగ్ కప్‌ను ప్రదర్శించారు. రేపటి నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు పోర్ట్ స్టేడియంలో మ్యాచ్‌లు జరగనున్నాయి.

News August 28, 2025

సీఎం పర్యటనకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

CM చంద్రబాబు పర్యటన సందర్భంగా పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం విశాఖ కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. హెలిప్యాడ్ వద్ద ముందస్తు చర్యలు, VIP ప్రోటోకాల్, గ్రీన్ రూమ్ ఏర్పాట్లను సమయానికి పూర్తి చేయాలని సూచించారు. నోవాటెల్, రాడిసన్ బ్లూ రిసార్ట్‌లలో జరిగే సమావేశాల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, ట్రేడ్ ప్రొమోషన్ కౌన్సిల్‌తో సమన్వయం చేయాలన్నార

News August 28, 2025

విశాఖలో ముగ్గురు కీలక నేతల పర్యటన

image

విశాఖలో ముగ్గురు ముఖ్య నాయకులు 3 రోజులపాటు పర్యటించనున్నారు. మంత్రి నారా లోకేశ్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు విశాఖలో పర్యటిస్తూ, టీడీపీ కార్యాలయంలో బస చేస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా 3 రోజుల పర్యటనలో పాల్గొననున్నారు. ఈనెల 29న సీఎం చంద్రబాబు విశాఖ రానున్నారు. ముగ్గురు నేతలు వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వీరి బందోబస్తుకి పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు.