News October 20, 2025
అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి: ASF కలెక్టర్

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి అని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖశాంతులతో పండుగను ఆనందంగా సురక్షితంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
Similar News
News October 20, 2025
రాజంపేట: విద్యార్థులను రక్షించిన పోలీసులు

అన్నమయ్య డ్యామ్ వద్ద నీటి ప్రవాహంలో చిక్కుకున్న ఐదుగురు బీటెక్ విద్యార్థులను రాజంపేట రూరల్ పోలీసులు ప్రాణాలకు తెగించి రక్షించారు. ఆదివారం రాత్రిపూట చీకటి, నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో రాత్రంతా ఘటనా స్థలంలో పహారా ఏర్పాటు చేసి, విద్యార్థులకు ధైర్యం చెప్పి, పరిస్థితిని అదుపులో ఉంచారు. సోమవారం ఉదయం నీటి ప్రవాహం కొంత తగ్గిన వెంటనే, వారిని రక్షించారు.
News October 20, 2025
ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి పరిహారం: డీజీపీ

TG: నిజామాబాద్‌లో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి డీజీపీ శివధర్ రూ.కోటి పరిహారం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. పదవీ విరమణ వరకు వచ్చే శాలరీ అందిస్తామని, 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేయిస్తామన్నారు. పోలీస్ భద్రత సంక్షేమం నుంచి రూ.16 లక్షలు, పోలీస్ వెల్ఫేర్ నుంచి రూ.8 లక్షల పరిహారాన్ని రేపు అమరవీరుల సభలో సీఎం ప్రకటిస్తారని వెల్లడించారు.
News October 20, 2025
దండారి ఉత్సవాల్లో పాల్గొన్న ఆదిలాబాద్ ఎంపీ

గిరిజనుల దండారి ఉత్సవాల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్ పాల్గొన్నారు. ఆదిలాబాద్‌లోని కొమరం భీమ్ కాలనీలో సోమవారం వేడుకలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కార్యక్రమమే దండారి ఉత్సవాలు అన్నారు. ఈ కార్యక్రమంలో తాటి పెళ్లి రాజు, కనపర్తి చంద్రకాంత్, తదితరులు పాల్గొన్నారు.