News December 19, 2025

అందరి సహకారంతోనే ఎన్నికలు ప్రశాంతం: ఎస్పీ జానకి

image

జిల్లాలో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తిగా శాంతియుత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయని నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. మూడు విడతలుగా నిర్వహించిన ఎన్నికల్లో ప్రజల సహకారం, వివిధ శాఖల అధికారుల సమన్వయం, పోలీస్ విభాగం కర్తవ్యనిష్ఠతో చేసిన సేవలే ఈ ఎన్నికల విజయానికి ప్రధాన కారణమని తెలిపారు. మూడు విడతల్లో 900 మందికి పైగా పోలీసులు విధులు నిర్వహించాలని తెలిపారు.

Similar News

News December 19, 2025

VJA: ఉచిత ప్రసాదంగా భక్తులకు లడ్డూలు అందజేత

image

భవానీ దీక్షా విరమణల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరగడంతో ముందస్తు ప్రణాళికతో 28.08 లక్షల లడ్డూలు తయారు చేశారు. ప్రారంభ నిల్వతో కలిపి మొత్తం 29.11 లక్షల లడ్డూలు అందుబాటులోకి వచ్చాయి. ఈ నెల 11 నుంచి 16 వరకు 22.70 లక్షల లడ్డూలు విక్రయమయ్యాయి. మిగిలిన లడ్డూల్లో 1.29 లక్షలను భక్తులకు ఉచిత ప్రసాదంగా, మిగతావి ప్రసాద కౌంటర్‌లో విక్రయిస్తున్నామని దేవస్థానం అధికారులు తెలిపారు.

News December 19, 2025

‘గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా సుందరీకరణ పనులు’

image

మేడారంలో పర్యటన సందర్భంగా మంత్రి సీతక్క సాండ్ స్టోన్ బొమ్మల లిపి చిత్రాలను, రాతి స్తంభాలను, ఐటిడిఏ ఆఫీసు నుంచి జంపన్నవాగు రహదారి పనులను పరిశీలించి.. తగినంత వాటర్ క్యూరింగ్ చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు. చిలకలగుట్ట జంక్షన్లో ఏర్పాటు చేస్తున్న సుందరీకరణ పనులను పరిశీలించి పర్యటకులను ఆకర్షించే విధంగా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా సుందరీకరించాలని ఆదేశించారు.

News December 19, 2025

VJA: సీపీ కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

image

ఎన్టీఆర్ జిల్లా సీపీ కార్యాలయంలో పోలీస్ పరిపాలనా విభాగం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీపీ రాజశేఖర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీస్ అధికారులు, సిబ్బందికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పండుగల ఆదర్శాలు అందరూ పాటించాలని సూచించారు. అనంతరం సెమీ క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ సరిత, ఈస్ట్ డీసీపీ కృష్ణకాంత్ పటేల్ పాల్గొన్నారు.