News February 7, 2025

అందాల పోటీల్లో చంద్రగిరి అమ్మాయికి కిరీటం.. CM ప్రశంస

image

మలేషియాలో జరిగిన మిస్ గ్లోబల్ ఆసియా-2025 విజేతగా చంద్రగిరికి చెందిన భావన రెడ్డి నిలిచారు. 18 ఏళ్లకే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె అంచెలంచెలుగా ఎదిగి మిస్ గ్లోబల్ ఆసియా-2025 కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఈ మేరకు ఆమె గురువారం CM చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. అంతర్జాతీయ వేదికపై తిరుపతి పేరును గట్టిగా వినిపించిన ఆమెను CM అభినందించారు. 

Similar News

News February 7, 2025

ADB:చైన్ దొంగలించబోయి దొరికిపోయాడు!

image

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి మాధస్తు మహేందర్ తన తల్లి విజయలక్ష్మితో కలిసి వాళ్ల బంధువులను చూడడానికి గురువారం సాయంత్రం వచ్చి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఏమాయికుంటకు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి విజయలక్ష్మి మెడలోని గొలుసును లాక్కునే ప్రయత్నం చేశాడు. దీంతో వారు దొంగ దొంగ అని అరవడంతో పారిపోగా..సెక్యూరిటీ పట్టుకొని పోలీసులకు అప్పగించారు.ఈ మేరకు రిమాండ్‌కు టూ టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు.

News February 7, 2025

ఉంగుటూరు: రోడ్డు ప్రమాద మృతులు కృష్ణా జిల్లా వాసులు

image

ఉంగుటూరు మండలం నాచుగుంట వద్ద జాతీయ రహదారిపై రాత్రి జరిగిన <<15374910>>రోడ్డు ప్రమాదంలో<<>> ఇద్దరు చనిపోయిన సంగతి విదితమే. మృతులు కృష్ణా(D) బాపులపాడు మండలం ఆరుగొలనుకు చెందిన దేవ మందిరం, విజయ్ బాబుగా గుర్తించారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబాల్లో వీరి మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. దేవ మందిరానికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. విజయ్‌బాబుకి భార్య, ఐటీఐ చదివే కుమారుడు, టెన్త్ చదువుతున్న కుమార్తె ఉన్నారు.

News February 7, 2025

ఎవరి ముందూ మోకరిల్లను: తీన్మార్ మల్లన్న

image

TG: తనకింకా షోకాజ్ నోటీసులు రాలేదని కాంగ్రెస్ MLC తీన్మార్ మల్లన్న తెలిపారు. వచ్చినా భయపడేది లేదని తేల్చిచెప్పారు. తీన్మార్ మల్లన్న ఎవరి ముందూ మోకరిల్లడంటూ వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్ తీరు బీసీలందరికీ షోకాజ్ ఇచ్చినట్లుగా ఉంది. దేనికీ నోటీసులు? వాటిని కులగణనలో భాగమైన నాయకులకివ్వాలి. అధిష్ఠానం ఆదేశాల్ని పాటించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. కులగణన అనేది పూర్తిగా జానారెడ్డి నివేదిక’ అని ఆరోపించారు.

error: Content is protected !!