News March 30, 2025
అందుకే అసెంబ్లీ పనిదినాలు పెంచాం: రఘురామకృష్ణరాజు

రాష్ట్ర ప్రజలు సమస్యలు చర్చించేందుకు అసెంబ్లీ పనిదినాలు 24 రోజులకు పెంచడం జరిగిందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. ఆదివారం అనకాపల్లిలో మీడియాతో మాట్లాడారు.. పులివెందుల ఎమ్మెల్యే జగన్ తన నియోజకవర్గ ప్రజల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడేందుకు రాకపోవడం ఆ నియోజకవర్గ ప్రజల దురదృష్టకరమన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అడిగే హక్కు జగన్‌కు లేదన్నారు. ఆ ప్రతిపక్ష హోదాను ప్రజలే తిరస్కరించారన్నారు.
Similar News
News September 14, 2025
కంకిపాడు: మోడరన్ పెంటాథలాన్ జట్ల ఎంపికలు నేడే

కంకిపాడు మండలం ఈడుపుగల్లులోని ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలో కృష్ణా జిల్లా మోడరన్ పెంటాథలాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా బాలబాలికల జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎంపికలు ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయని అసోసియేషన్ కార్యదర్శి సురేంద్ర తెలిపారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు సెప్టెంబర్ 20, 21 తేదీల్లో కాకినాడలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆయన చెప్పారు.
News September 14, 2025
JNTUలో పార్ట్ టైం PhD కోసం ప్రవేశ పరీక్షలు

జేఎన్టీయూ యూనివర్సిటీలో పార్ట్ టైం PhD కోసం పరీక్షలు జరుగుతున్నాయి. నేడు ఉదయం కంప్యూటర్ సైన్స్ ఎగ్జామ్ జరగనుంది. మధ్యాహ్నం మెకానికల్ తోపాటు EEE విభాగంలోని కోర్సులకు పరీక్ష నిర్వహించనున్నట్లు ఎగ్జామినేషన్ డైరెక్టర్ కృష్ణమోహన్‌రావు వెల్లడించారు. పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
News September 14, 2025
అనంతపురంలో కిలో టమాటా ధర రూ.17

అనంతపురం నగర శివారులోని కక్కలపల్లి మార్కెట్‌లో టమాటా ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం కిలో గరిష్ఠ ధర రూ.17, కనిష్ఠ ధర రూ.8 ఉంది. సరాసరి రూ.12 ప్రకారం క్రయవిక్రయాలు జరుగుతున్నట్లు మార్కెట్ యార్డ్ కార్యదర్శి రూప్ కుమార్ తెలిపారు. ఇప్పటికే రైతులు పెద్దమొత్తంలో టమాటాను మార్కెట్‌కు తీసుకొచ్చారని పేర్కొన్నారు.