News December 11, 2025
అందుకే నరసింహ రైట్స్ అమ్మలేదు: రజినీకాంత్

రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ‘నరసింహ’ మూవీని రేపు రీరిలీజ్ చేస్తున్నారు. ‘సినీ కెరీర్ స్టార్ట్ అయ్యి 50 ఏళ్లు. నరసింహ రిలీజై 25 ఏళ్లు పూర్తయ్యాయి. థియేటర్లలో ఈ సినిమా చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకోవాలి. అందుకే డిజిటల్ రైట్స్ ఇవ్వలేదు’ అని సినిమా హీరో, ప్రొడ్యూసర్, రచయిత రజినీకాంత్ చెప్పారు. కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్‌లో క్యారెక్టర్ స్ఫూర్తితో నీలాంబరి పాత్ర రాసినట్టు తెలిపారు.
Similar News
News December 13, 2025
AP న్యూస్ అప్డేట్స్

* వచ్చే మార్చి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 60 టీటీడీ ఆలయాల్లో అన్నప్రసాదాలు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం ఒక్కో టెంపుల్‌లో రూ.60కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామన్నారు.
* సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఈ నెల 17, 18 తేదీల్లో కలెక్టర్ల సదస్సు జరగనుంది. సూపర్ సిక్స్, GSDP లక్ష్యాలపై దిశానిర్దేశం చేయనున్నారు.
* ఈ నెల 24న మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తామని సీఎస్ విజయానంద్ తెలిపారు.
News December 13, 2025
భారత్‌పై టారిఫ్‌లు.. ట్రంప్‌పై వ్యతిరేకత

భారత్‌పై 50% టారిఫ్‌లు విధించిన US అధ్యక్షుడు ట్రంప్‌పై ఆ దేశ చట్టసభలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ సుంకాలను రద్దు చేయాలని ప్రతినిధుల సభ సభ్యులు డెబోరా, మార్క్ విసీ, కృష్ణమూర్తి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ టారిఫ్‌లు చట్టవిరుద్ధమని, INDతో సంబంధాలకు నష్టమని విమర్శించారు. <<18529624>>పుతిన్-మోదీ<<>> భేటీపైనా USలో ప్రకంపనలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ పరిణామాలు ట్రంప్‌కు ఎదురుదెబ్బేనని నిపుణులు అంటున్నారు.
News December 13, 2025
ఒకే బిల్వ పత్రంతో ఎన్నిసార్లైన పూజ చేయవచ్చా?

శివుడికి అత్యంత ప్రీతికరమైనది బిల్వపత్రం. శివలింగంపై ఒకసారి సమర్పించిన పత్రాన్ని శుద్ధి చేసి, మళ్లీ పూజకు ఉపయోగించవచ్చని పండితులు చెబుతున్నారు. ‘శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి పూజలో ఒక్క దళం సమర్పించినా కూడా చాలు. అది ఎంతో పవిత్రమైనది. పూజకు ప్రతిసారి కొత్త పత్రాన్నే సమర్పించాల్సిన నియమం లేదు. అదే పత్రాన్ని మళ్లీ మళ్లీ ఉపయోగించడం వల్ల పూజారాధన ఫలితం ఏమాత్రం తగ్గిపోదు’ అని అంటున్నారు.


