News April 13, 2025
అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరించాలి: కలెక్టర్

రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 14 వరకు గడువు ఉండటంతో ఎక్కువ సంఖ్యలో దరఖాస్తుదారులు వచ్చే అవకాశం ఉన్నందున ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్‌లు అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరించాలని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం సెలవు అయినప్పటికీ దరఖాస్తుదారులు వచ్చే అవకాశం ఉన్నందున, దరఖాస్తుల కొరత రాకుండా తగినన్ని అందుబాటులో ఉంచాలని తెలిపారు.
Similar News
News November 11, 2025
జగిత్యాల జిల్లా దిశా కమిటీ సమావేశంలో ఎంపీ అరవింద్

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో దిశా కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఇందులో చైర్మన్ హోదాలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొని కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, వాటి పనితీరుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జగిత్యాల MLA డా.సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, అడిషనల్ కలెక్టర్లు బీఎస్.లత, రాజ గౌడ్, దిశా కమిటీ సభ్యులు, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
News November 11, 2025
NGKL: ‘పీఎం ధాన్ ధాన్య కృషి యోజన అమలు పక్కాగా చేయాలి’

నాగర్‌కర్నూల్ జిల్లాలో రానున్న ఆరేళ్లపాటు పంట ఉత్పాదకత పెంచడం, పంటల మార్పిడి, సుస్థిర వ్యవసాయ విధానాలను ప్రోత్సహించే విధంగా ప్రధానమంత్రి ధాన్ ధాన్య కృషి యోజన అమలుకు సమగ్ర కార్యాచరణ వార్షిక ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. మంగళవారం అదనపు కలెక్టర్ దేవ సహాయంతో కలిసి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ, పశుసంవర్ధక తదితర శాఖల పనితీరును అడిగి తెలుసుకున్నారు.
News November 11, 2025
ఢిల్లీ పేలుడు.. రూ.10 లక్షల పరిహారం

ఢిల్లీలో జరిగిన పేలుడులో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని సీఎం రేఖా గుప్తా ప్రకటించారు. శాశ్వతంగా వికలాంగులైన వారికి రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు అందిస్తామన్నారు. గాయపడిన వారికి నాణ్యమైన చికిత్సను అందిస్తామని చెప్పారు. ఢిల్లీ శాంతిభద్రతలు తమ బాధ్యత అని పేర్కొన్నారు.


