News June 2, 2024
అందేశ్రీ గీతానికి ఇందూరే స్ఫూర్తి

తెలంగాణ రాష్ట్రీయ గీతం రచయిత అందెశ్రీకి ఇందూరుతో అభినవభావ సంబంధం ఉంది. 1978లో బతుకుదెరువు కోసం ఆర్మూర్ పరిధిలో తాపీ పని చేస్తున్న అందె ఎల్లయ్య.. మానిక్‌బండార్ పరిధిలో ఆశ్రమం నడుపుతున్న శంకర్‌మహరాజ్ దృష్టిలో పడ్డారు. నీ పని ఇదికాదురా.. అందరిని చైతన్యం చేసే అక్షరాన్ని ఆయుధంగా సంధించాలని జ్ఞానభిక్ష పెట్టి అందెశ్రీగా నామకరణం చేశారు. చదువు లేకున్నా.. ఏకసంతాగ్రాహిగా, పాటల రచన, గానం చేశారు అందెశ్రీ.
Similar News
News July 6, 2025
NZB: రూ.500 కోట్లతో ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి: కవిత

కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.500 కోట్లతో ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆదివారం ఏకలవ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎరుకల సామాజికవర్గానికి అన్ని పార్టీలు రాజకీయంగా అవకాశాలు కల్పించాలని సూచించారు.
News July 6, 2025
నిజామాబాద్‌లో సందడి చేసిన నటి అనసూయ

నిజామాబాద్ నగరంలో నటి అనసూయ ఆదివారం సందడి చేసింది. హైదరాబాద్ రోడ్డులోని ఓ షాప్ ఓపెనింగ్ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. పలు పాటలకు స్టెప్పులు వేసి ఉర్రూతలూగించారు. ఆమె మాట్లాడుతూ.. నిజామాబాద్‌కు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇందూరులో తనకు ఇంత మంది అభిమానులు ఉండటం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు.
News July 6, 2025
NZB: ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకొన్నట్లు నిజామాబాద్ 4వ టౌన్ SI శ్రీకాంత్ శనివారం తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. వినాయక్ నగర్‌కు చెందిన మల్లెపూల సందీప్ కుమార్(36) వ్యాపారంలో నష్టాలకు గురయ్యాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడంతో శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.