News February 13, 2026

అందోల్: భోజనం పెట్టలేదని కౌంటింగ్ సిబ్బంది నిరసన

image

అందోల్-జోగిపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం లేదని ఎన్నికల సిబ్బంది నిరసన తెలిపారు. ఉదయం నుంచి విధుల్లో ఉన్నామని టిఫిన్ సైతం సరిగా ఇవ్వలేదని.. మధ్యాహ్నం భోజనం పెట్టరా అని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారన్నారు. సిబ్బందికి సరిపడా భోజనం పెట్టలేదని, కర్రీ పాయింట్‌లో ఉడికీఉడకని అన్నం తీసుకొచ్చి పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News February 13, 2026

మున్సిపోల్స్: కరీంనగర్‌లో బీజేపీలోకి ఇద్దరి చేరిక

image

TG: కరీంనగర్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 13వ డివిజన్‌లో గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి తెల్ల లక్ష్మి, 15వ డివిజన్‌లో విజయం సాధించిన ఏఐఎఫ్‌బీ అభ్యర్థి విపల సాయి జ్యోతి బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కరీంనగర్ కార్పొరేషన్‌లో 66 సీట్లు ఉండగా బీజేపీ 30 సీట్లు గెలిచింది. తాజాగా ఇద్దరి చేరికతో ఆ పార్టీ బలం 32కి చేరింది.

News February 13, 2026

T20WC: నెదర్లాండ్స్ ఘోర ఓటమి

image

చెన్నై వేదికగా USAతో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఘోరంగా ఓడింది. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు 15.5 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌట్ అయింది. బాస్ డీ లీడే(23) టాప్ స్కోరర్‌గా నిలిచారు. మిగతా బ్యాటర్లందరూ చేతులెత్తేయడంతో భారీ ఓటమి తప్పలేదు. హర్మీత్ సింగ్ 4 ఓవర్లలో 21 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీశారు.

News February 13, 2026

RGM: ఎరువుల ఉత్పత్తికి సంపూర్ణ సహకారం: కలెక్టర్

image

రామగుండం RFCLలో నిర్దేశించిన లక్ష్యం మేరకు ఎరువులు ఉత్పత్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శుక్రవారం ఆయన కర్మాగారంలోని సెంట్రల్ కంట్రోల్ రూమ్, ప్రిల్లింగ్ టవర్, బ్యాగింగ్, లోడింగ్, డిస్పాచ్ విభాగాలను పరిశీలించారు. తెలంగాణ రైతులకు యాసంగి సీజన్లో 2,14,223 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినందుకు యాజమాన్యాన్ని అభినందించారు.