News April 3, 2025

అంబటి ఫిర్యాదు నమోదు చేయండి: హైకోర్టు

image

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు వెంటనే నమోదు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తనతో పాటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషిస్తూ, సామాజిక మాధ్యమాలలో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు అంబటి ఫిర్యాదు చేశారు. మొత్తం ఐదు ఫిర్యాదులు ఇవ్వగా నాలుగు మాత్రమే నమోదు చేయడంతో హైకోర్టును ఆయన ఆశ్రయించారు.

Similar News

News March 2, 2026

దుగ్గిరాలలో రోడ్డు ప్రమాదం.. చెట్టు ఎక్కిన బైక్!

image

బైక్ అదుపు తప్పి ఇద్దరు యువకులు గాయపడగా, వారి వాహనం వింతగా చెట్టుపైకి దూసుకెళ్లిన ఘటన దుగ్గిరాల లాకు వద్ద జరిగింది. చినరావూరుకు చెందిన కిషోర్, విజయ్ ప్రయాణిస్తున్న బైక్ ప్రమాదవశాత్తూ పడిపోగా, బైక్ మాత్రం చెట్టు కొమ్మల్లో ఇరుక్కుపోయింది. గాయపడిన యువకులను చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News March 2, 2026

తుళ్లూరులో కొడుకుని పట్టించిన పేరెంట్స్..!

image

తుళ్లూరు మండల పరిధిలోని గ్రామాల్లో ఆవులను దొంగతనం చేస్తున్న వ్యక్తిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు శ్రీకాంత్ మండల వ్యాప్తంగా సుమారు 25 ఆవులకు పైగా అపహరించినట్లు పలువురు యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతణ్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా, స్టేషన్ వెనకవైపు ఉన్న గోడ దూకి పారిపోయాడు. తిరిగి కుటుంబ సభ్యులు పోలీసులకు అప్పజెప్పగా సిబ్బంది పేరెంట్స్‌ను అభినందించారు.

News March 2, 2026

గుంటూరులో ప్రారంభమైన రెవెన్యూ క్లినిక్

image

గుంటూరు కలెక్టరేట్ శంకర్ సమావేశ మందిరంలో రెవెన్యూ క్లినిక్ సోమవారం ప్రారంభమైంది. జేసీ శ్రీవాత్సవ, ఆర్డీఓ శ్రీనివాసరావు డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ కుమారి అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. భూ సమస్యలు, వివాదాలకు సంబంధించిన అర్జీలు అందాయి. రెవెన్యూ క్లినిక్ వచ్చే సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని జేసీ అధికారులను ఆదేశించారు.