News December 26, 2024
అంబటి రాంబాబు మరో సంచలన ట్వీట్
‘పూర్తి పరిష్కారానికి సోఫా చేరాల్సిందే’ అంటూ అంబటి రాంబాబు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. పుష్ప-2 సినిమాలో ఓ సన్నివేశానికి సంబంధించిన డైలాగ్‌తో ట్వీట్ చేశారు. కాగా అల్లు అర్జున్ పై తెలంగాణ ప్రభుత్వం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సినీ పరిశ్రమ పెద్దలు రేవంత్ రెడ్డిని నేడు కలిసిన సందర్భంలో ఈ ట్వీట్ చేయడంతో నెటిజన్లు దీనిని వైరల్ చేస్తున్నారు.
Similar News
News December 27, 2024
గుంటూరు పరేడ్ గ్రౌండ్‌లో దేహధారుడ్య పరీక్షలు
పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల దేహధారుణ్య పరీక్షలకు గుంటూరు పోలీస్ పరేడ్ మైదానాన్ని సిద్ధం చేయమని గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ ఐపీఎస్ ఆదేశించారు. డిసెంబర్ 30న పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో గురువారం నగరంలోని మైదానాన్ని ఎస్పీ పరిశీలించారు. అభ్యర్థులకు ప్రతి పరీక్ష ఘట్టం అర్థమయ్యే రీతిలో మైదానంలో సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు SPలు GV రమణమూర్తి, సుప్రజ పాల్గొన్నారు.
News December 27, 2024
మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు: అంబటి
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై వైసీపీ నేత అంబటి రాంబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘పరిపాలనాదక్షుడు, ఆర్థికవేత్త, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు’ అని ట్వీట్ చేశారు. కాగా 92 ఏళ్ల మన్మోహన్ సింగ్ కొన్నినెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇవాళ మరింత క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. ఆయన 2004-2014 వరకు ప్రధానిగా సేవలందించారు.
News December 26, 2024
మంగళగిరి బాలికకు బాలపురస్కార్ అవార్డు
గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన మాత్రపు జెస్సిరాజ్ అనే 9వ తరగతి బాలిక అంతర్జాతీయ స్థాయిలో ఆర్టిస్టిక్ స్కేటింగ్‌లో బంగారు పతకాన్ని గెలిచింది. న్యూజిల్యాండ్‌లో జరిగిన ప్రపంచ స్థాయి పోటీలో బాలిక బంగారు పతకం పొందారు. ఈ సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా గురువారం ప్రధాన మంత్రి బాల పురస్కార్ అవార్డును బాలిక అందుకున్నారు. దీంతో కలెక్టర్ నాగలక్ష్మి, అధికారులు బాలికను అభినందించారు.