News January 30, 2025

అంబర్‌పేటలో కానిస్టేబుల్ ఆత్మహత్య

image

ఆర్థిక ఇబ్బందులతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. మాదన్నపేట PSలో PCగా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు (42) అంబర్‌పేటలోని దుర్గానగర్‌లో ఉంటున్నారు. అతనికి భార్య ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. తన ఇంట్లో ఫ్యాన్‌కి చున్నీతో ఉరి వేసుకొన్నాడు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Similar News

News March 1, 2026

ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అయతుల్లా అరాఫీ

image

ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా సీనియర్ మతాధికారి అయతుల్లా అరాఫీ వ్యవహరించనున్నట్లు ఇరాన్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. నిన్న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో సుప్రీం లీడర్ ఖమేనీ హతమైన సంగతి తెలిసిందే. కాగా అరాఫీ ప్రస్తుతం అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ డిప్యూటీ ఛైర్మన్‌గా, ఇరాన్ సెమినరీ సిస్టమ్ హెడ్‌గా పనిచేస్తున్నారు. గార్డియన్ కౌన్సిల్ సభ్యుడిగానూ ఉన్నారు.

News March 1, 2026

HYD: ‘CM కాలి గోటికి కూడా KTR, హరీశ్‌ సరిపోరు’

image

KTR, హరీశ్‌రావు ఇద్దరు కలిసినా రేవంత్ రెడ్డి కాలి గోటికి సరిపోరని కాంగ్రెస్ నేత మెట్టు సాయికుమార్ విమర్శించారు. ఆదివారం గాంధీ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. అధికారం పోగానే గుంటనక్క KTR సాధు జంతువు అయ్యారా అని ప్రశ్నించారు. గత 10 ఏళ్లలో నగరంలోని పలు ప్రాంతాలను కబ్జాలు చేసింది మీరు కాదా అని మండిపడ్డారు. BRS లాంటి నీచరాజకీయాలు కాంగ్రెస్ చేయదని వ్యాఖ్యానించారు.

News March 1, 2026

ఆర్టీసీ డ్రైవర్ పోస్టుకు 6 అడుగుల ఎత్తు ఉండాలా? మంత్రి క్లారిటీ

image

TG: RTC డ్రైవర్ పోస్టుకు 6 అడుగుల ఎత్తు ఉండాలన్న ప్రచారాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. ‘RTC నియామకాలకు RTCకి ఎలాంటి సంబంధం ఉండదు. ఆర్టీసీ నియామకాలు పోలీసు రిక్రూట్‌‌మెంట్‌ సెల్ పరిధిలో చేపడతారు. డ్రైవర్ పోస్టుకు 6 అడుగుల ఎత్తు ఉండాలనేది తప్పుడు ప్రచారం. MV యాక్ట్ ప్రకారం 5.3అడుగులు(160cm) ప్రామాణికం. రోడ్డు రవాణా శాఖపై తప్పుడు ప్రచారాలు చేస్తే లీగల్ చర్యలు తప్పవు’ అని హెచ్చరించారు.