News April 5, 2025

అంబాజీపేట: అన్న కర్మకాండ రోజునే తమ్ముళ్లు మృతి

image

అంబాజీపేట మండలం గంగలకుర్రులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. గత నెల 24న సూర్యనారాయణమూర్తి మృతి చెందగా అతని సోదరులు నాగరాజు, రామచంద్రరావు దిన కార్యం నిర్వహించారు. గోదావరిలో నదికి స్నానానికి బైకుపై వెళ్తుండగా వారిని టిప్పర్‌ ఢీకొట్టింది. అన్న దినకార్యం రోజునే ఇద్దరు సోదరులు మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.

Similar News

News April 5, 2025

ప్రధాని మోదీ నకిలీ ఓటర్ కార్డును రూపొందించిన ChatGPT

image

సైబర్ నేరగాళ్ల చేతిలో ChatGPT దుర్వినియోగానికి గురవుతోంది. దీనితో ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులను సైతం నకిలీ చేస్తున్నారు. రియలిస్టిక్ ఆధార్ & పాన్ కార్డులు, పాస్‌పోర్ట్‌, ఓటరు IDలను ఇది రూపొందించింది. అందించిన వివరాలతో ChatGPT చేసిన కార్డులు నకిలీవని గుర్తించడం చాలా కష్టమని నిపుణులు చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఓటర్ కార్డును కూడా ఇది నకిలీ చేసింది.

News April 5, 2025

‘మహాకాళి’ సినిమాలో బాలీవుడ్ నటుడు?

image

‘ఛావా’ సినిమాలో విలనిజంతో ఆకట్టుకున్న అక్షయ్ ఖన్నా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌(PVCU)లో రానున్న ‘మహాకాళి’ సినిమాలో ఆయన నటించనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మూవీలో అక్షయ్ కీలక పాత్రలో కనిపిస్తారని తెలిపాయి. దీనిపై మూవీ యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. కాగా ‘ఛావా’లో ఔరంగజేబు పాత్రలో అక్షయ్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

News April 5, 2025

మేడ్చల్: గుండెపోటుతో చనిపోయిన విద్యార్థి ఇతనే

image

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుండెపోటుతో మరణించిన విద్యార్థి వివరాలు తెలిశాయి. ఖమ్మం జిల్లాకు చెందిన వినయ్ అనే విద్యార్థి, సీఎంఆర్ కాలేజీలో బీటెక్ 4వ సంవత్సరం చదువుతున్నాడు. తోటి విద్యార్థులతో కలసి క్రికెట్ ఆడుతుండగా ఆకస్మికంగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. తోటి విద్యార్థులు వెంటనే ఆస్పత్రికి తరలించినా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

error: Content is protected !!