News March 24, 2025

అంబాజీపేట: తలపై ఇనుప గొట్టం పడి యువకుడి మృతి

image

అంబాజీపేట మండలం చిరుతపూడికి చెందిన యువకుడు డి శ్రీనివాస్ (25) అమలాపురంలో స్లాబ్ పనులు నిర్వహిస్తుండగా తలపై ఇనుప గొట్టం పడి మృతి చెందాడు. అతని కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. ఆదివారం శ్రీనివాస్ కూలీలతో కలిసి అమలాపురం పనికి వెళ్లాడు. ఓ భవనం వద్ద కాంక్రీట్ స్లాబ్ పనులు నిర్వహిస్తుండగా పైఅంతస్తు నుంచి ఇనుప గొట్టం తలపై పడింది. చికిత్స నిమిత్తం రాజమండ్రి తీసుకెళ్లగా అక్కడ మృతి చెందాడు.

Similar News

News March 26, 2025

కాంస్య పతకం గెలిచిన భారత రెజ్లర్

image

జోర్డాన్ రాజధాని అమ్మన్‌లో జరుగుతోన్న సీనియర్ ఏషియన్ ఛాంపియన్‌షిప్-2025లో భారత రెజ్లర్ కాంస్య పతకం గెలుచుకున్నారు. 87 కేజీల విభాగంలో చైనా రెజ్లర్‌ను చిత్తు చేసి బ్రాంజ్ మెడల్ సాధించారు. దీంతో భారత్ పతకాల ఖాతా తెరిచింది. హరియాణాకు చెందిన సునీల్ గతంలో ఏషియన్ ఛాంపియన్ షిప్స్‌లో ఒక గోల్డ్ (2020), ఒక సిల్వర్ (2019), రెండు బ్రాంజ్ (2022, 2023) మెడల్స్ గెలిచారు.

News March 26, 2025

లింగ నిర్ధారణ పరీక్ష చట్టరీత్యా నేరం: MNCL కలెక్టర్

image

లింగ నిర్ధారణ పరీక్ష చేయడం చట్టరీత్యా నేరమని, ఇందుకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమయ్యారు. స్కానింగ్ సెంటర్లలో పుట్టబోయేది ఆడబిడ్డ, మగబిడ్డ అని తెలపవద్దని సూచించారు. చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో తగ్గిన బాలికల నిష్పత్తిపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.

News March 26, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

error: Content is protected !!