News April 4, 2025
అంబాజీపేట: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

అంబాజీపేట మండలం గంగలకుర్రు ప్రాథమిక పాఠశాల వద్ద ప్రధాన రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ స్కూటీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఒకరు మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 16, 2025
ఈ-క్రాప్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి: జేసీ

ఖరీఫ్ సీజన్ 2025-26 ధాన్యం సేకరణపై జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు సక్రమంగా జరిగేందుకు ఈ-క్రాప్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులందరి వివరాలు నమోదు చేయాలని సూచించారు.
News September 16, 2025
దళితవాడల్లో 1,000 ఆలయాలు: TTD

AP: మత మార్పిడుల నివారణకు దళితవాడల్లో 1,000 ఆలయాలు నిర్మిస్తామని TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌లో 6 ఆలయాలు నిర్మిస్తామన్నారు. టీటీడీ ధర్మకర్తల సమావేశం నిర్ణయాలను ఆయన వెల్లడించారు. ‘ఈ నెల 24 నుంచి వచ్చే నెల 2 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం. ఆ రోజుల్లో VIP బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నాం. 24న సీఎం దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు’ అని వివరించారు.
News September 16, 2025
ప్రజలకు విశాఖ సిటీ పోలీసుల హెచ్చరిక

విశాఖపట్నం సిటీ పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. లోన్ యాప్స్ వలలో పడి అనేక మంది వేధింపులకు గురవుతున్నారని పేర్కొన్నారు. డౌన్లోడ్ చేసిన వెంటనే వ్యక్తిగత సమాచారం దోచుకుని, ఫోటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని తెలిపారు. సైబర్ మోసాలకు గురవకుండా అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి మోసాలు ఎదురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని సూచించారు.