News April 14, 2025
అంబేడ్కర్‌కి నివాళి అర్పించిన కలెక్టర్

ఒంగోలులో అధికారులు, ప్రజాప్రతినిధులు అంబేడ్కర్ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. HCM కళాశాల సెంటర్, కలెక్టరేట్ సెంటర్‌లో ఉన్న అంబేడ్కర్ విగ్రహాలకు జిల్లా కలెక్టర్ అన్సారియా, ఒంగోలు, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, విజయ్ కుమార్, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, డీఆర్ఓ చిన్న ఓబులేసు, వివిధ దళిత సంఘాల నాయకులు ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం అంబేడ్కర్ గురించి కొనియాడారు.
Similar News
News April 15, 2025
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 124 పోస్టులు

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 124 ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల పోస్టుల మంజూరుకు మంగళవారం జీవో విడుదలైంది. వీటిలో ఉమ్మడి జిల్లాకు 74 SGT(ప్రాథమిక స్థాయి), 50 స్కూల్ అసిస్టెంట్ల(ద్వితీయ స్థాయి) పోస్టులు మంజూరయ్యాయి. ఈ పోస్టులను ఇప్పటికే ఉన్న సర్ప్లస్ ఉపాధ్యాయ పోస్టులను మార్చి రూపొందించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
News April 15, 2025
ప్రకాశం: AB వెంకటేశ్వరరావుపై వైసీపీ ఎమ్మెల్యే ఫైర్

AB వెంకటేశ్వరరావుపై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ట్విట్టర్(ఎక్స్) వేదికగా సోమవారం ఫైర్ అయ్యారు. “జగన్‌ని హత్యచేయాలన్న పన్నాగంతోనే శ్రీనివాస్ దాడికి పాల్పడినట్టుగా ఛార్జ్ షీట్‌లో ఎన్‌ఐఏ చెప్పిన విషయం AB వెంకటేశ్వరరావు మరిచిపోయారా అని ప్రశ్నించారు. జగన్‌పై దాడి చేసిన సమయంలో డీజీపీగా ఉన్న ఠాకూర్‌కి, ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉన్న మీకు నామినేటెడ్ పోస్టులు ఎలా వచ్చాయ్? అంటూ ప్రశ్నించారు.
News April 15, 2025
బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ దామోదర్

తాళ్లూరు మండలం సోమవారపాడు, తూర్పు గంగవరంలోని గుంటి గంగాభవాని అమ్మవారి తిరుణాళ్ల సందర్భంగా ఏర్పాటుచేసిన పోలీస్ బందోబస్తును సోమవారం రాత్రి జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పరిశీలించారు. తిరుణాళ్లలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టిగా ఏర్పాటు చేశామన్నారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని పోలీసులకు సూచించారు.