News April 14, 2025
అంబేడ్కర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి: ఆసిఫాబాద్ ఎస్పీ

అంబేడ్కర్‌ను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు అన్నారు. ఆసిఫాబాద్ పోలీస్ కార్యాలయంలో జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం కోసం, ప్రజలు హక్కుల కోసం అంబేడ్కర్ ఎంతో కృషి చేశారని కొనియాడారు.
Similar News
News April 15, 2025
సుందరీమణులు పాల్గొనే కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు మే 14వ తేదీన వరంగల్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని HNK కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో సమావేశం నిర్వహించారు. వరంగల్ పర్యటనలో భాగంగా సుందరీమణులు కాళోజీ కళాక్షేత్రాన్ని సందర్శించనున్నారని, తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
News April 15, 2025
ఉమ్మడి కర్నూల్ జిల్లాలో 240 పోస్టులు.!

రాష్ట్రంలోని 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను ప్రభుత్వం సృష్టించింది. ఇందులో భాగంగా ఉమ్మడి కర్నూల్ జిల్లాలో 240 పోస్టులు. వీటిలో 110 ఎస్‌జీటీ, 69 స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఉమ్మడి కర్నూల్ జిల్లాలో 199 స్కూల్ అసిస్టెంట్ టీచర్లు అవసరం కాగా గతంలోనే 69 పోస్టులు మంజూరు చేసింది. తాజాగా 130 పోస్టులను కేటాయిస్తూ డీఎస్సీ ద్వారా వీటిని భర్తీ చేస్తామని ప్రకటించింది.
News April 15, 2025
ఉమ్మడి అనంతపురం జిల్లాలో 201 పోస్టులు.!

రాష్ట్రంలోని 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను ప్రభుత్వం సృష్టించింది. ఇందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 201 పోస్టులు. వీటిలో 101 ఎస్‌జీటీ, 100 స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 178 స్కూల్ అసిస్టెంట్ టీచర్లు అవసరం కాగా గతంలోనే 78 పోస్టులు మంజూరు చేసింది. తాజాగా 100 పోస్టులను కేటాయిస్తూ డీఎస్సీ ద్వారా వీటిని భర్తీ చేస్తామని ప్రకటించింది.