News April 14, 2025

అంబేడ్క‌ర్ ఆశ‌యాల బాట‌లో అడుగేద్దాం: కలెక్టర్ 

image

అంబేడ్క‌ర్ ఆశ‌యాల బాట‌లో అడుగేద్దామని, ఆయ‌న స్ఫూర్తితో చిన్నారులు బాగా చ‌దువుకొని జీవితంలో ఉన్న‌తంగా ఎదిగేందుకు కృషి చేయాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అన్నారు. విజ‌య‌వాడ‌లోని లెనిన్ సెంట‌ర్‌లో ఉన్న అంబేడ్క‌ర్ విగ్ర‌హానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల అభ్యున్న‌తి, దేశాభివృద్ధికి అయన చేసిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయమన్నారు. 

Similar News

News July 4, 2025

HYD: మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై కేటీఆర్ ట్వీట్

image

మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితుల గురించి మాజీ మంత్రి కేటీఆర్ వివరణ ఇచ్చారు. కేసీఆర్ రొటీన్ హెల్త్ చెకప్‌లో భాగంగా గురువారం ఆసపత్రిలో చేరారన్నారు. బ్లడ్ షుగర్, సోడియం లెవెల్స్ మానిటర్ చేయడం కోసం 1, 2రోజులు ఆస్పత్రిలో ఉండాల్సిందిగా డాక్టర్లు సూచించారని పేర్కొన్నారు. కేసీఆర్ ఆరోగ్య సమాచారం అడుగుతూ ఆయన క్షేమంగా ఉండాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు.

News July 4, 2025

పార్టీ పదవులను క్యాజువల్‌గా తీసుకోవద్దు: రేవంత్

image

TG: రాష్ట్రంలో వచ్చే పదేళ్లు కాంగ్రెస్‌దే అధికారం అని CM రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. ‘కేంద్రం మెడలు వంచి జనగణనలో కులగణన చేసేలా చేశాం. ఎవరూ పార్టీ పదవులను క్యాజువల్‌గా తీసుకోవద్దు. వాటితోనే గుర్తింపు, గౌరవం లభిస్తాయి. అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెరగబోతున్నాయి. కొత్త నాయకత్వానికి 2029 ఎన్నికలు వేదిక కావాలి. కష్టపడి మళ్లీ INCని అధికారంలోకి తేవాలి’ అని TPCC కార్యవర్గ సమావేశంలో పేర్కొన్నారు.

News July 4, 2025

అల్లూరి ధైర్యాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలి: కలెక్టర్

image

స్వరాజ్య సంగ్రామ చరిత్రలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు దేశభక్తి, ధైర్యాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. శుక్రవారం నంద్యాల కలెక్టరేట్లో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మన్యం వీరుడు అల్లూరి స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసిన మహనీయుడన్నారు. కార్యక్రమంలో జేసీ విష్ణు చరణ్ పాల్గొన్నారు.