News October 23, 2025

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు గుడ్ న్యూస్

image

BA, B.COM, BSC చదువుతున్న విద్యార్థులకు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ గుడ్‌న్యూస్ ప్రకటించింది. 2019-24 మధ్యలో చేరిన విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించే గడువును పొడిగించింది. విద్యార్థులు తమ ట్యూషన్ ఫీజును నవంబర్ 13లోపు చెల్లించాలని స్టూడెంట్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. వర్సిటీ వెబ్ సైట్‌లో పూర్తి వివరాలున్నాయన్నారు. సందేహాలుంటే 040-23680333 నంబరుకు ఫోన్ చేయాలని కోరారు.

Similar News

News October 23, 2025

రావి చెట్టును ఎందుకు పూజించాలి?

image

రావి వృక్షం సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం. యజ్ఞాలలో జమ్మితో పాటు రావి కర్రలను కూడా ఉపయోగిస్తారు. దీని ఔషధ గుణాలు అనారోగ్యాలను దూరం చేస్తాయి. గర్భదోషాలు తొలగించే గుణం ఉన్నందున సంతానం లేనివారు ఈ చెట్టుకు ప్రదక్షిణ చేస్తే సంతానం కలుగుతుందని నమ్మకం. బుద్ధునికి జ్ఞానోదయమైంది ఈ వృక్షం కిందే. అందుకే ఆలయాల్లో రావి వృక్షాలకు కూడా పూజలు చేస్తారు. ☞ ఇలాంటి ఆధ్యాత్మిక కంటెంట్ కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీ వెళ్లండి.

News October 23, 2025

కొనసాగుతున్న క్యాబినెట్ భేటీ

image

TG: సీఎం రేవంత్ అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో క్యాబినెట్ భేటీ కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు, సుప్రీంకోర్టులో ప్రతికూల పరిస్థితులు ఎదురైన నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై కీలకంగా చర్చిస్తున్నారని సమాచారం. ఇటీవల వివాదాలతో వార్తల్లో నిలిచిన కొండా సురేఖ సైతం క్యాబినెట్ భేటీకి హాజరయ్యారు.

News October 23, 2025

ఉయ్యూరు: బాలికపై లైంగిక దాడి.. నిందితుడి అరెస్ట్

image

ఉయ్యూరులో 8 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేసిన షేక్ చాన్ బాషా (30)ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు డీఎస్పీ చలసాని శ్రీనివాసరావు తెలిపారు. చాక్లెట్ల ఆశ చూపి చిన్నారిని తన గదిలోకి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారం చేశాడని, ఎవరికైనా చెబితే చంపేస్తానని చాకుతో బెదిరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడికి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ పేర్కొన్నారు.