News September 13, 2025
అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీగా రాహుల్ మీనా

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీగా రాహుల్ మీనా నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం శనివారం జిల్లాల వారీగా ఎస్పీలను బదిలీ చేసింది. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన కృష్ణారావును డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ మీనా సోమవారం జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు ఎస్పీ కార్యాలయం తెలిపింది.
Similar News
News September 13, 2025
రేపు మ.2 వరకే చంద్రగిరి కోటలో ప్రవేశానికి అనుమతి

చంద్రగిరి కోటకు వచ్చే పర్యాటకులకు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నట్లు తిరుపతి కలెక్టర్ కార్యాలయం తెలిపింది. భద్రతా కారణాల దృష్ట్యా అనుమతి ఇవ్వలేమని చెప్పారు. సోమవారం నుంచి యథావిథిగా పర్యాటకులకు కోటను చూడడానికి అనుమతిస్తున్నట్లు చెప్పారు. పర్యాటకులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
News September 13, 2025
జగిత్యాల: ‘రాజకీయ నాయకులు కలిసి పనిచేయాలి’

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మాజీ మంత్రి, తెలంగాణ తొలి ఆర్థిక సంఘం చైర్మన్ రాజేశం గౌడ్ శనివారం హైదరాబాద్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ మేరకు లోక్ జనశక్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వికాస్, ఎన్‌ఆర్‌ఐ విష్ణు ప్రకాష్‌తో కలిసి పలు అంశాలపై చర్చించారు. సమాజంలోని ప్రతి వర్గానికి ఉపయోగపడేలా రాజకీయ నాయకులు కలిసి పనిచేయాలని, ప్రజల అవసరాలను గుర్తించి ముందడుగు వేయాలని నాయకులు తెలిపారు.
News September 13, 2025
సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి: CM

AP: రాజకీయ ముసుగులో జరిగే నేరాలను ఉపేక్షించవద్దని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎస్పీలతో సమావేశమైన ఆయన.. టెక్నాలజీ సాయంతో దర్యాప్తులో అత్యుత్తమ ఫలితాలు రాబట్టవచ్చని తెలిపారు. రియాక్ట్, రీచ్, రెస్పాండ్, రిజల్ట్ విధానం పాటించాలన్నారు. సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలని ఆదేశించారు. వైఎస్ వివేకానంద హత్య, సింగయ్య మృతిని కేసు స్టడీలుగా చూడాలని సూచించారు.