News January 10, 2026

అంబేడ్కర్ కోనసీమ: ‘రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి’

image

ఆరోగ్యవంతమైన కూరగాయలు, ఆకుకూరల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం, ఉద్యాన శాఖ సహకారంతో కృషి కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా మిద్దె తోటల పెంపకానికి సహకారం అందిస్తున్నట్లు కంపెనీ సీఈవో అడ్డాల గోపాలకృష్ణ తెలిపారు. ఈ పథకానికి దరఖాస్తు గడువు ఈ నెల 18తో ముగియనుందని, ఆసక్తి గలవారు రూ.3,000 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Similar News

News January 11, 2026

NGKL జిల్లాలో 1,008 టన్నుల యూరియా నిల్వలు: కలెక్టర్

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రస్తుతం 1,008 టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెలకు గాను జిల్లాకు 6,619 టన్నుల యూరియా కేటాయించబడిందని, జడ్చర్ల, గద్వాల పాయింట్ల ద్వారా ఇది సరఫరా అవుతుందని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 300 ఎరువుల దుకాణాల ద్వారా రైతులకు పంపిణీ చేస్తున్నట్లు ఆయన వివరించారు.

News January 11, 2026

SSS: డెడ్ బాడీని పీక్కుతిన్న జంతువులు..?

image

పుట్టపర్తి – నారాయణపురం రైల్వే స్టేషన్ల మధ్య కొత్తచెరువు (M) లోచర్ల సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద ఓ పురుషుడి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. మృతుడికి సుమారు 50-60 ఏళ్ల వయసుంటుందన్నారు. అతని ఎత్తు 5.6 అడుగులు ఉన్నాడన్నారు. అతణ్ని అడవి జంతువులు పీక్కు తిన్నట్లు ఆనవాళ్లు ఉన్నాయన్నారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం పెనుకొండ ఆసుపత్రికి తరలించినట్లు హెడ్ కానిస్టేబుల్ ఎర్రిస్వామి తెలిపారు.

News January 11, 2026

లింగాల: గురుకుల ప్రవేశ పరీక్షలకు ఉచిత శిక్షణ

image

లింగాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పేద విద్యార్థుల కోసం టీ.జి.వి.సెట్ (TG CET 2026) ప్రవేశ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు నిర్వాహకులు రాజకుమార్ తెలిపారు. 4, 5, 6, 7వ తరగతుల్లో ప్రవేశం కోరుకునే విద్యార్థులకు డాక్టర్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. గతంలో ఈయన శిక్షణ ద్వారా 108 మంది విద్యార్థులు వివిధ గురుకులాలకు ఎంపికయ్యారని ఆయన పేర్కొన్నారు.