News February 18, 2025
అంబేడ్కర్ కోనసీమ: వర్సిటీలకు నూతన వీసీలు నియామకం

కాకినాడ జేఎన్టీయూ నూతన వీసీగా ప్రొఫెసర్ డాక్టర్ సి.ఎస్.ఆర్.కె ప్రసాద్, నన్నయ విశ్వవిద్యాలయ నూతన వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ సత్తుపాటి ప్రసన్న శ్రీ మంగళవారం నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలోనే వీరు వీసీలుగా బాధ్యతలు స్వీకరిస్తారని వర్సిటీ అధికారులు తెలిపారు. వీరి నియామకంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News February 27, 2026
ఇథనాల్ మిక్స్.. మీ వాహనం సేఫేనా – 1/2

ఏప్రిల్ 1 నుంచి E20+RON 95 కాంబినేషన్‌లో ఫ్యూయెల్ అందించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. రీసెర్చ్ ఆక్టేన్ నంబర్ అనేది పెట్రోల్ నాణ్యతను సూచిస్తుంది. ప్రస్తుతం చెలామణిలో ఉన్న RON 91ను RON 95 రీప్లేస్ చేయనుంది. ఈ RON ఎంత ఎక్కువ ఉంటే వాహనానికి అంత మంచిది. ఇథనాల్ ప్రభావం వాహనంపై పడకూడదని RON 95ను కేంద్రం తీసుకొచ్చింది. 2023కి ముందు తయారైన వాహనాలకు మాత్రం ఈ నిర్ణయం సవాళ్లను తెచ్చే ఛాన్స్ ఉంది.
News February 27, 2026
ఇథనాల్ మిక్స్.. మీ వాహనం సేఫేనా – 2/2

వాహనం 2023 కన్నా ముందుదైతే E20కి తగినదో కాదో చెక్ చేయడం మంచిది. E20కి పనికిరాదంటే తరచూ సర్వీస్ చేయిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి. ట్యాంక్‌లో E20 పెట్రోల్ నిలువ ఉంచి వాహనం ఎక్కువ కాలం వాడకపోతే ఇంజిన్, ఫ్యూయెల్ సిస్టమ్ పాడైపోతాయి. E20తో వాహనాల మైలేజ్ తగ్గుతుంది. క్రూడ్ ఆయిల్ దిగుమతులు, కాలుష్యం తగ్గించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నా, వీటితో పాత వాహనదారులకు మెయింటెనెన్స్ భారంగా మారే అవకాశం ఉంది.
News February 27, 2026
ఎన్టీఆర్: MBA పరీక్షల ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో 2025 నవంబర్ నెలలో జరిగిన ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ 3వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను వర్సిటీ పరీక్షలు నియంత్రణ అధికారి శివప్రసాదరావు శుక్రవారం విడుదల చేశారు. రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు మార్చి 9వ తేదీ లోపు రూ.1,860 నగదు చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చూడాలన్నారు.


