News February 15, 2025

అంబేడ్కర్ కోనసీమ: విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతి

image

సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో విద్యుత్ షాక్‌కు గురై నాగేశ్వరరావు (49) శుక్రవారం మృత్యువాత పడ్డాడు. రొయ్యల చెరువు వద్ద మేత వేస్తూ కరెంటు షాకుకు గురయ్యాడు. అతన్ని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా నాగేశ్వరరావు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై మృతిని భార్య వరలక్ష్మి ఫిర్యాదుపై సఖినేటిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News September 14, 2025

కామారెడ్డి: నేటి చికెన్ ధరల వివరాలు ఇలా…!

image

కామారెడ్డిలో ఆదివారం చికెన్ ధరలు గత వారం రేటుకే విక్రయిస్తున్నారు. కిలో చికెన్ ధర రూ.240గా, లైవ్ కోడి ధర కిలోకు రూ.140గా చికెన్ సెంటర్ నిర్వాహకులు విక్రయాలు చేస్తున్నారు. గత వారం నమోదైన ధరలే ఈ వారం కూడా అమలులో ఉండటంతో వినియోగదారులకు ఎలాంటి భారం లేకుండా అందుబాటులో ఉన్నాయి. ధరల్లో మార్పు లేకపోవడంతో కొనుగోలుదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

News September 14, 2025

పాల్వంచలో హోటల్ లో దొంగల హల్చల్

image

పాల్వంచలోని కుంటి నాగులగూడెం క్రాకర్స్ షాపు ఎదురుగా ఉన్న బాబాయ్ హోటల్లో అర్ధరాత్రి దొంగతనం జరిగింది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు షాపులోకి చొరబడి సుమారు 20 వేల రూపాయల నగదుతో పాటు కిరాణా సామాగ్రిని దొంగలించారు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. హోటల్ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News September 14, 2025

నెల్లూరులో యువతి దారుణ హత్య.. UPDATE

image

బుచ్చి(M) పెనుబల్లికి చెందిన గిరిబాబు, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి మైథిలీప్రియ (23) బీఫార్మసీ పూర్తి చేసింది. ఆ సమయంలో సహ విద్యార్థి నిఖిల్‌ను ప్రేమించింది. కొన్నాళ్లుగా నిఖిల్‌ మరో యువతితో సన్నిహితంగా ఉండటంపై మైథిలీప్రియ గొడవ పడుతోంది. ఈక్రమంలో ఆమెను మాట్లాడాలని పిలిచి నిఖిల్‌‌ <<17695710>>కత్తితో పొడిచి హత్య<<>> చేశాడు. అనంతరం దర్గామిట్ట పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు.