News October 17, 2024
అంబేడ్కర్ వర్సిటీ DEGREE, PG ప్రవేశ గడువు పెంపు

ఉమ్మడి జిల్లాలోని బి.ఆర్ అంబేడ్కర్ కళాశాలలో డిగ్రీ, పీజీల్లో చేరడానికి చివరి తేదీని అక్టోబరు 30 వరకు పొడిగించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. 2022-23, 2023-24 విద్యా సంవత్సరంలో డిగ్రీలో చేరిన ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు ట్యూషన్ రుసుం చెల్లించాలని, అంతకుముందు చేరిన విద్యార్థులు సైతం అక్టోబరు 30 లోపు ఆన్‌లైన్లో చెల్లించాలని, మిగతా వివరాల కొరకు www.braou.ac.inలో పరిశీలించాలన్నారు.
Similar News
News September 14, 2025
MBNR: జాతీయ లోక్ అదాలత్..2,597 కేసులు పరిష్కారం

జాతీయ మెగా లోక్ అదాలత్‌లో మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో 2,597 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ఎస్పీ డి.జానకి అన్నారు. ఆమె మాట్లాడుతూ.. 15 రోజులుగా పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది కేసుల్లో ఉన్న కక్షిదారులను స్వయంగా కలిసినందువల్ల రాజీ మార్గం అవగాహన కలిగించి, లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాలకూ ‘మీ ఇంటికే సత్వర న్యాయం’ జరిగిందని, మానిటరింగ్ చేసిన చేసినవారికి త్వరలో రివార్డు అందజేస్తామన్నారు.
News September 14, 2025
MBNR: ఉపాధ్యాయుడి అరెస్ట్.. జైలుకు తరలింపు

విద్యార్థిని లైంగికంగా వేధించిన ఓ ఉపాధ్యాయుని పోలీసులు శనివారం అరెస్టు చేసి జైలుకు పంపించారు. పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పదో తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. నీ చదువుకు కావలసిన డబ్బంతా నేను ఖర్చు పెడతానని విద్యార్థినితో పదేపదే అనడంతో.. ఆ విద్యార్థి పేరేంట్స్‌కి చెప్పింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.
News September 13, 2025
MBNR: యూరియా పంపిణీపై కలెక్టర్ ఆదేశం

జిల్లాలోని ప్రతి రైతుకు యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాకు వచ్చిన 600 మెట్రిక్ టన్నుల యూరియాను అన్ని ప్రాంతాలకు వెంటనే సరఫరా చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ పాల్గొన్నారు.