News April 12, 2025
అంబేద్కర్ జయంతిని విజయవంతం చేయండి: కలెక్టర్

ఈ నెల 14వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని జిల్లాలో ఘనంగా నిర్వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పిలుపునిచ్చారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి సభ గోడపత్రికలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య,అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, తదితరులు ఆవిష్కరించారు.
Similar News
News April 13, 2025
ప్రపంచంలో మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ ఇవే

ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ గేమ్‌గా ఫుట్‌బాల్ నిలిచింది. 3.5 బిలియన్ డాలర్ల బ్రాండ్ వ్యాల్యూతో సాకర్ మొదటిస్థానంలో కొనసాగుతోంది. 2.5 బిలియన్ డాలర్ల బ్రాండ్ వ్యాల్యూతో క్రికెట్ రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత హాకీ (2 బిలియన్), టెన్నిస్ (1 బిలియన్), వాలీబాల్ (900 మిలియన్) టాప్-5లో నిలిచాయి. టేబుల్ టెన్నిస్, బాస్కెట్ బాల్, బేస్ బాల్, రగ్బీ, గోల్ఫ్ టాప్-10లో చోటు దక్కించుకున్నాయి.
News April 13, 2025
సెల్‌ఫోన్ ఎక్కువగా వాడొద్దని మందలించినందుకు ఆత్మహత్య

సెల్‌ఫోన్ ఎక్కువగా వాడొద్దని మందలించినందుకు యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కోటగిరికి చెందిన లక్ష్మణ్ (20) అనే యువకుడు ఎక్కవ సమయాన్ని సెల్ ఫోన్ వాడకానికి కేటాయిస్తున్నాడని తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన లక్ష్మణ్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై సందీప్ తెలిపారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు.
News April 13, 2025
2026 ఎన్నికల్లో గెలుపు ఎన్డీయేదే: అన్నామలై

2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో NDA అధికారంలోకి వస్తుందని ఆ రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్ అన్నామలై ధీమా వ్యక్తం చేశారు. డీఎంకేను అధికారం నుంచి దించడమే లక్ష్యంగా AIADMK, బీజేపీ కలిసి పని చేస్తాయని తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల అమిత్ షా పర్యటన తర్వాత పార్టీ మరింత బలపడిందని చెప్పారు. తాను పార్టీ కోసం పని చేసే సాధారణ కార్యకర్తనని, తమ కొత్త అధ్యక్షుడిని బలోపేతం చేసే దిశగా పని చేస్తానని ఆయన వివరించారు.