News March 7, 2025

అక్కయ్యపాలెం: నకిలీ రైల్వే ఉద్యోగి అరెస్టు

image

నకిలీ రైల్వే ఉద్యోగితో ఇబ్బందులు పడ్డ బాధితులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ద్వారా సోంబాబును గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు డీఆర్ఎం ఆఫీస్‌లో ఏసీ, టీవీలు తక్కువ ధరకు ఇప్పిస్తానని అక్కయ్యపాలెం ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం, ఎలమంచిలి, దువ్వాడ ప్రాంతాల్లో కొందరిని మోసం చేశాడు. లోకో పైలట్ ఎంప్లాయ్ అని నకిలీ ఐడీ చూపించేవాడు. టూ టౌన్ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు.

Similar News

News September 14, 2025

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను మోదీ ఆదుకుంటున్నారు: మాధవ్

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను వాజపేయి ఆదుకున్నట్టే నేడు మోదీ ఆదుకుంటున్నారని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పేర్కొన్నారు. సారథ్యం యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడారు. అమెరికా టారిఫ్‌లతో ఏపీలో పలు వర్గాలు నష్టపోతున్నాయని, ఆత్మనిర్భర్ భారత్ దీన్ని పరిష్కరించగలదని పేర్కొన్నారు. స్వదేశీ ఉద్యమాన్ని ఏపీ బీజేపీ ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. బీజేపీని ఇంటింటికి విస్తరించడమే తన లక్ష్యంగా చెప్పుకొచ్చారు.

News September 14, 2025

‘బీజేపీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి అభివృద్ధిని వివరించండి’

image

దేశ ఆర్థిక వ్యవస్థ 2014లో 11వ స్థానంలో ఉండగా మోదీ నేతృత్వంలో ఇప్పుడు మూడో స్థానానికి చేరిందని
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. విశాఖలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రక్షణ రంగం, రహదారులు, పోర్టులు, రైల్వేలు, వైద్య కళాశాలలు, విమానాశ్రయాలు ఇలా అన్ని రంగాల్లో విస్తృత అభివృద్ధి సాధించామని పేర్కొన్నారు. కార్యకర్తలు గ్రామ గ్రామానికీ వెళ్లి NDA అభివృద్ధిని వివరించాలని పిలుపునిచ్చారు.

News September 14, 2025

వికసిత్ భారత్ బీజేపీ ప్రధాన లక్ష్యం: జేపీ నడ్డా

image

వికసిత భారత్ బీజేపీ ప్రధాన లక్ష్యమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఆదివారం విశాఖ రైల్వే గ్రౌండ్స్‌లో సారద్యమ్ సభలో ఆయన మాట్లాడారు. వైసీపీ పాలనలో ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ అంధకారంలో మగ్గిందని విమర్శించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన కేవలం 15 నెలల్లోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమయిందని చెప్పారు. మోదీ, చంద్రబాబు అంకితభావం వల్లే ఈ మార్పు సాధ్యమైందన్నారు.