News July 11, 2025
అక్టోబర్ 1కి అన్నీ పనులు ప్రారంభం: మంత్రి నారాయణ

నెల్లూరులోని అభివృద్ధి పనులపై టీడీపీ నేతలు, కార్పొరేషన్ అధికారులతో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. నగర కార్పొరేషన్లో రూ.830 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టబోతున్నామన్నారు. ఇప్పటికే డ్రైన్లలో పూడికతీత పనులు జరుగుతున్నాయన్నారు. అక్టోబర్ 1వ తేదీ కల్లా అన్ని పనులు ప్రారంభం అవుతాయని చెప్పారు.
Similar News
News August 30, 2025
నెల్లూరు జిల్లా గిరిజనులకు గమనిక

నెల్లూరు జిల్లాలో గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక(గ్రీవెన్స్ డే) నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ ప్రకటించారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి సూచనల మేరకు గిరిజనుల కోసం ప్రత్యేకంగా డివిజన్ స్థాయిలో గ్రీవెన్స్ డే ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వచ్చే నెల 6న కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయం, నెల్లూరు, కావలి, ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయాల్లో అర్జీలు స్వీకరిస్తామన్నారు.
News August 30, 2025
నెల్లూరు SP కీలక ప్రకటన

శాంతి భద్రతల పరిరక్షణ కోసం నెల్లూరు జిల్లాలో సెప్టెంబర్ 30వ తేదీ వరకు పోలీస్ 30 యాక్ట్ సెక్షన్ అమలులో ఉంటుందని SP కృష్ణకాంత్ వెల్లడించారు. ప్రజాసంఘాలు, యూనియన్లు, రాజకీయ పార్టీలు పోలీస్ అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ప్రదర్శనలు, ధర్నాలు చేయరాదని స్పష్టం చేశారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News August 30, 2025
పోలీసుల వైఫల్యం లేదు: కోటంరెడ్డి

ప్రాణమంటే ఎవరికైనా తీపేనని.. తనను తాను ఎలా కాపాడుకోవాలో తెలుసని నెల్లూరు రూరల్ MLA కోటంరెడ్డి చెప్పారు. ‘మంత్రివర్గ విస్తరణలో నా పేరు ఉందనే వివాదాలు చుట్టుముట్టాయని అంటున్నారు. నేను మూడోసారి గెలిచి 14 నెలలు అవుతోంది. అందరికీ మంచే చేశాను. ఏ వివాదాల జోలికి నేను వెళ్లలేదు. పోలీసుల వైఫల్యం లేదు. వీడియో గురించి ఎస్పీకి తెలిసిన వెంటనే నాకు చెప్పలేదనే చిన్న అసంతృప్తి మాత్రం ఉంది’ అని కోటంరెడ్డి అన్నారు.