News September 26, 2025

అక్టోబర్ 10వ తేదీ లోపు ధాన్యం కొనుగోలు కేంద్రాలు: జేసీ

image

ధాన్యం కొనుగోలు కేంద్రాలను అక్టోబర్ 10వ తేదీ లోపు ఏర్పాటు చేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం తాడేపల్లిగూడెం (M) మాధవరం కమ్యూనిటీ హాల్లో రైతులతో సమావేశం నిర్వహించారు. ఆర్ఎస్కేలలో నిర్ధారించిన తేమ శాతం మాత్రమే పరిగణలోకి తీసుకుంటామన్నారు. సర్పంచ్ ముప్పిడి సూర్యకుమారి, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వరరావు, మండల వ్యవసాయ అధికారి నారాయణరావు పాల్గొన్నారు.

Similar News

News September 26, 2025

ప.గో జిల్లాలో కొబ్బరికి డిమాండ్

image

కొబ్బరికాయలకు భారీ స్థాయిలో డిమాండ్ పెరిగింది. దసరా ఉత్సవాల్లో భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు, పూజల్లో కొబ్బరికాయలు అధికంగా కొబ్బరి కాయలను వినియోగిస్తారు. కేరళ ప్రాంతం నుంచి ప.గో జిల్లాకు కొబ్బరికాయలు దిగుమతి అయ్యేవి. తుఫాన్, వర్షాభావ పరిస్థితులతో అక్కడి నుంచి దిగుమతులు తగ్గడంతో ఈ ప్రాంతంలోని కొబ్బరి చెట్లనుంచి కాయలను దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుతం కాయ ధర 50-70 పలుకుతోంది.

News September 26, 2025

భీమవరం: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

భీమవరం-విస్సాకోడేరు వంతెన వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో విస్సాకోడేరుకు చెందిన ఎర్ర మోహన సాయి (25) మృతి చెందాడు. ఓ షాపులో పనిచేస్తున్న తన సోదరిని తీసుకురావడానికి బైక్‌పై సాయి వెళ్తుండగా, వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 26, 2025

పనులను లక్ష్యాల మేరకు పూర్తి చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను లక్ష్యాల మేరకు పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. గురువారం కలెక్టరేట్లో డ్వామా కార్మిక శాఖల జిల్లా అధికారులు, జిల్లాలోని ఎంపీడీవోలతో వివిధ అంశాలపై ఆమె సమీక్షించారు. 2025-26 సంబంధించి కొత్త క్యాటిల్ షెడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో హార్టికల్చర్ ప్లాంటేషన్ 350 ఎకరాల్లో చేపట్టాల్సి ఉందన్నారు.