News October 9, 2025
అక్టోబర్ 10 నుంచి బోధనేతర పనుల బహిష్కరణ

ప్రభుత్వ పాఠశాలల్లో బోధనేతర కార్యక్రమాల వలన బోధన సమయం హరించిపోతోందని AP ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఆరోపించింది. దఫాలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. దీంతో బోధనేతర పనులను అక్టోబర్ 10వ తేదీ నుంచి బహిష్కరించాలని తీర్మానించుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గురువారం మెమోరాండాన్ని ఏజన్సీ DEO మల్లేశ్వరరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో UTF అధ్యక్షులు రాంబాబుదొర ఉన్నారు.
Similar News
News October 9, 2025
బీజేపీ అంతర్గత చర్చకు నాకు సంబంధం లేదు: బొంతు

TG: తనను బీజేపీ అభ్యర్థిగా <<17960394>>ప్రతిపాదించిన<<>> విషయంపై పీసీసీ ఉపాధ్యక్షుడు బొంతు రామ్మోహన్ స్పందించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేస్తానన్న మాటల్లో వాస్తవం లేదన్నారు. తన అభ్యర్థిత్వంపై కాషాయ పార్టీలో అంతర్గత చర్చకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ‘నేను కాంగ్రెస్‌లోనే ఉన్నా.. ఉంటాను కూడా. ఇక్కడ సంతృప్తిగా ఉన్నాను’ అని ప్రకటన విడుదల చేశారు.
News October 9, 2025
APPSC పరీక్షల ఫలితాలు విడుదల

AP: వివిధ డిపార్టుమెంటు పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఆయా పోస్టులకు ఎంపికైన వారి జాబితాలను కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచింది. అసిస్టెంటు ట్రైబల్ ఆఫీసర్, అసిస్టెంటు కెమిస్ట్ (గ్రౌండ్ వాటర్), లైబ్రేరియన్స్ (మెడికల్), ఫిషరీస్ డెవలప్మెంటు ఆఫీసర్ (ఫిషరీస్) పోస్టులకు ఎంపికైన వారి వివరాలను వెల్లడించింది. ఆ వివరాలను ఇక్కడ <
News October 9, 2025
CM నెల్లూరు జిల్లా పర్యటన ఖరారు

సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటన ఖరారు అయింది. శుక్రవారం మ. 2.25 గంటలకు ఆయన కోవూరు(M) పోతిరెడ్డిపాలెంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గానా మైపాడు గేట్ సమీపంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్‌ను ప్రారంభిస్తారు. షాపు ఓనర్లతో ఫొటోషూట్ అనంతరం 3.05 నిముషాలకు తిరిగి పోతిరెడ్డి పాలెం హెలిప్యాడ్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి ఈదగాలి వెళ్తారు.