News October 16, 2025

అక్టోబర్ 21 నుంచి వ్యాసరచన పోటీలు: ఎస్పీ రాజేశ్ చంద్ర

image

కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ 21 నుంచి 31 వరకు జరిగే పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు అక్టోబర్ 21 నుంచి 28 వరకు ఆన్‌లైన్‌లో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో నిర్వహించే ఈ పోటీల్లో డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర, విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండటం అనే అంశాలపై రాయాలని సూచించారు.

Similar News

News October 16, 2025

నెల్లూరు: బస్టాండ్ ఓ చోట.. బస్సులు ఆపేది మరోచోట

image

నిత్యం రద్దీగా ఉండే నెల్లూరు RTC బస్టాండ్ ఎదురుగా ఆటోలు, ప్రైవేట్ బస్సులు ఇష్టానుసారంగా ఆపేస్తున్నారు. ముఖ్యంగా అధికారులు సర్వోదయ కాలేజీని అనుకుని యూనియన్ బ్యాంక్ వద్ద బస్టాండ్‌ని ఏర్పాటు చేశారు. అక్కడ మాత్రం వాహనాలు నిలపకుండా..కాలేజ్ ఎదురుగా ఆపేస్తున్నారు. ఫలితంగా బస్టాండ్ కట్టినా ప్రయోజనం ఉండడం లేదు. దీంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఇకనైనా ట్రాఫిక్ పోలీసులు తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది.

News October 16, 2025

జూబ్లీహిల్స్‌లో బై‘పోల్‌’ పరేషాన్!

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అభ్యర్థులకు టెన్షన్ పట్టుకుంది. ఇక్కడ ఓటు వేసేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇది ఈసారేకాదు నియోజకవర్గం కొత్తగా ఏర్పడినప్పటి నుంచీ జరుగుతోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటివరకు మూడుసార్లు ఎన్నికలు జరిగాయి. 2014లో 56 శాతం, 2018లో 47.58 శాతం, 2023లో 45.59 శాతం పోలింగ్ జరిగింది. అంటే పదేళ్లలో దాదాపు 10 శాతం పడిపోయింది. మరి ఈసారి ఎంత శాతం నమోదవుతుందో చూడాలి.

News October 16, 2025

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు స్వాగతం పలికిన మహబూబ్‌నగర్ కలెక్టర్

image

మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి గురువారం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో పూల మొక్కతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక పోలీసుల నుంచి రాష్ట్ర గవర్నర్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.