News September 20, 2025
అక్టోబర్ 7న దక్షిణ భారత సైన్స్ డ్రామా పోటీ: డీఈఓ

రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి ఆదేశాల మేరకు అక్టోబర్ 7న జేపీఎస్‌ఎస్ పాఠశాలలో జిల్లా స్థాయి దక్షిణ భారత సైన్స్ డ్రామా పోటీలు-2025 నిర్వహిస్తున్నట్లు డీఈఓ దీపక్ తివారి తెలిపారు. మానవాళి ప్రయోజనం కోసం సైన్స్ & టెక్నాలజీ అనే ప్రధాన అంశంతో ఈ పోటీలు జరుగుతాయన్నారు. ‘విజ్ఞానంలో మహిళలు’, ‘స్మార్ట్ వ్యవసాయం’, ‘అందరికీ ఆరోగ్యం’, ‘గ్రీన్ టెక్నాలజీస్’ వంటి అంశాలు ఇందులో ఉంటాయని వివరించారు.
Similar News
News September 20, 2025
ఖమ్మం రీజియన్‌లో ఉద్యోగులకు బదిలీలు

ఖమ్మం రీజియన్‌లో ఆర్టీసీ ఉద్యోగులను బదిలీ చేస్తు RM సరిరామ్ ఉత్తర్వులు జారీ చేశారు. కండక్టర్లు, డ్రైవర్లు, శ్రామిక్‌లకు పదోన్నతులతో పాటు వారు కోరుకున్న చోటుకు బదిలీలు కల్పించారు. RMగా సరిరామ్ బాధ్యతలు తీసుకున్న ఏడాదిలోనే రెండవసారి పదోన్నతులు, బదిలీలు చేపట్టడం ద్వారా జిల్లాలోని ఉద్యోగులు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News September 20, 2025
చీకట్లో కరీంనగర్ స్మార్ట్ సిటీ

కరీంనగర్ కార్పొరేషన్‌లో స్ట్రీట్ లైట్స్ నిర్వహణ చూసే EESL ఏజెన్సీ కాంట్రాక్ట్ ముగియడంతో స్ట్రీట్ లైట్స్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. నగరవ్యాప్తంగా 11 వేల వీధిలైట్లు ఉండగా 150 CCMS బాక్సులు, టైమర్స్, సెన్సార్లు, బ్రేకర్లు రిలేలు పనిచేయడం లేదు. రోజుకు 140 వరకు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
News September 20, 2025
AIIMSలో 77 ఉద్యోగాలకు నోటిఫికేషన్

హైదరాబాద్ సమీపంలోని బీబీనగర్ AIIMSలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 77 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అభ్యర్థులు ఈ నెల 26లోగా అప్లై చేసుకోవాలి. వయసు 45 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.1,170. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. విద్యార్హతలు, జీతభత్యాల వివరాల కోసం <
#ShareIt