News October 4, 2025
అక్టోబర్ 7న శబరి స్మృతి యాత్ర: ఆలయ ఈవో దామోదర్

భద్రాచలం దేవస్థానంలో అక్టోబర్ 7న ‘శబరి స్మృతి యాత్ర’ నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో దామోదర్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సరాల మాదిరిగానే ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. యాత్రలో పాల్గొనే గిరిజనులను వారి స్వగ్రామాలకు చేర్చడానికి బస్సులను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.
Similar News
News October 4, 2025
సంగారెడ్డి: నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం

జిల్లాలో గత నెల 21 నుంచి ఈనెల 3 వరకు దసరా సెలవులు ఇవ్వడంతో అవి పూర్తి కావడంతో నేటి నుంచి అన్ని రకాల పాఠశాలలు ప్రారంభం కానున్నాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. పాఠశాలలోని పరిసరాలను పరిశుభ్రం చేసిన తర్వాతనే విద్యార్థులను తరగతి గదులలో కూర్చోబెట్టాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశించారు.
News October 4, 2025
విశాఖలో HSBC బ్యాంకు!

AP: అతిపెద్ద విదేశీ బ్యాంకు HSBC వైజాగ్‌లో తమ బ్రాంచ్ ఏర్పాటు చేయనుంది. విశాఖతో పాటు దేశంలోని 20 ప్రాంతాల్లో తమ శాఖలను విస్తరించేందుకు RBI అనుమతిచ్చిందని HSBC వెల్లడించింది. అనువైన ప్రాంతంలో భవనం దొరగ్గానే విశాఖలో బ్రాంచ్ ఏర్పాటు చేస్తామని ఆ బ్యాంక్ ఇండియా ఇంటర్నేషనల్ అండ్ ప్రీమియం బ్యాంకింగ్ విభాగం హెడ్ సందీప్ బాత్రా తెలిపారు. ఈ 20 శాఖలు ఏర్పాటైతే దేశంలో తమ బ్రాంచుల సంఖ్య 46కు చేరుతుందన్నారు.
News October 4, 2025
VJA: మహిళ స్నానం చేస్తుండగా ఫోటోలు.. వ్యక్తి అరెస్ట్

బాత్‌రూమ్‌లో మహిళ స్నానం చేస్తుండగా ఫొటోలు తీసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ హనుమాన్‌పేటలోని ఓ హోటల్‌లో గత నెల 26న బస చేసిన సూర్యాపేట కుటుంబానికి చెందిన మహిళ స్నానం చేస్తుండగా, పక్క రూమ్‌లోని పల్నాడు జిల్లాకు చెందిన అంకమ్మ రాజు ఫోటోలు తీసి పరారయ్యాడు. బాధితురాలు ఫిర్యాదు చేయగా, నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ నాగ మురళి తెలిపారు.